సెక్స్ వర్కర్ల జీవితంలో మార్పు తీసుకొచ్చిన COVID-19

  • Published By: veegamteam ,Published On : June 28, 2020 / 05:14 PM IST
సెక్స్ వర్కర్ల జీవితంలో మార్పు తీసుకొచ్చిన COVID-19

ముంబైలోని భీవండీ రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లు ప్రొఫెషన్ మార్చుకుంటున్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వారు పనులు పూర్తిగా ఆగిపోవడంతో జీవనం సమస్యగా మారిపోయింది. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు భీవండి ఎన్జీవో ముందుకొచ్చింది. అగరుబత్తుల ప్యాకింగ్ పనుల్లో కుదిర్చింది. జాతీయ వ్యాప్తంగా జరిగిన లాక్ డౌన్ కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో జరిగినా సెక్స్ వర్కర్ల పాలిట శాపంగా మారింది.

సెక్స్ వర్కర్లు వారి కుటుంబాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. శ్రీ సాయిసేవా సంస్థ ఎన్జీవో సెక్స్ వర్కర్లకు ఆహారం అందించడంతో పాటు లాక్ డౌన్ సమయంలో ఆదుకున్నారు. సాయిసేవా సంస్థ ఫౌండర్ డాక్టర్ స్వాతి ఖాన్ మాట్లాడుతూ.. ‘565 మహిళలకు ఆహారం అందించాం. లాక్‌డౌన్ ఉన్నంత కాలం వారికి పూట గడవడమే ప్రశ్నగా మారింది. కరోనా సమయంలో వారి పనిచేసుకోవడాన్ని పోలీసులు అడ్డుకున్నారు’ అని అన్నారు.

 

సెక్స్ వర్కర్లు మమ్మల్ని కలిశారు. కరోనా సమయంలో ఏదైనా పని కావాలి 130మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తహసీల్దార్ తో పాటు మరికొందరు వ్యాపారవేత్తలతో కలిసి వారికి పని ఇప్పించగలిగాం. 25 సెక్స్ వర్కర్లకు ట్రైనింగ్ ఇవ్వడంతో రోజుకు రూ.210 సంపాదించుకుంటున్నారు. ఇది మొత్తం కాంట్రాక్ట్ పని. 25వర్కర్లను సెలక్ట్ చేసి పని ఇచ్చాం. రెడ్ లైట్ ఏరియాలో పనిచేస్తున్నా.. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తున్నారు.

 

కరోనా వైరస్ కారణంగా మా కమ్యూనిటీలో ఆధాయం లేకుండాపోయిందని ఓ సెక్స్ వర్కర్ రాణి ఖాన్ చెప్తుంది. స్వాతి మేడమ్ ను రిక్వెస్ట్ చేయడంతో ఈ ఉద్యోగానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు బాగా అనిపిస్తుందని చెప్పింది.