Us Strategic Command: అమెరికాను హడలెత్తించిన చిన్నారి ట్వీట్!

గజిబిజి అక్షరాలు.. మరికొన్ని సింబల్స్ కలిసిన ;l;;gmlxzssaw, అనే పదం అగ్రరాజ్యం అమెరికా మొత్తం హాట్ టాపిక్ అయింది. అసలు ఆ పదానికి అర్థమేంటి.. ఇది న్యూక్లియ‌ర్ లాంచ్ కోడా.. లేక ఉగ్రవాదులు ఎవరైనా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి చేసిన ట్వీటా..

Us Strategic Command: అమెరికాను హడలెత్తించిన చిన్నారి ట్వీట్!

Us Strategic Command

Us Strategic Command: గజిబిజి అక్షరాలు.. మరికొన్ని సింబల్స్ కలిసిన ;l;;gmlxzssaw, అనే పదం అగ్రరాజ్యం అమెరికా మొత్తం హాట్ టాపిక్ అయింది. అసలు ఆ పదానికి అర్థమేంటి.. ఇది న్యూక్లియ‌ర్ లాంచ్ కోడా.. లేక ఉగ్రవాదులు ఎవరైనా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి చేసిన ట్వీటా.. లేక అధికారులే సామాన్యులకు అర్థంకాని భాషలో, ఆపరేషన్ లో భాగంగా మరొక సంస్థకి ఈ కోడ్ పంపించారా? అర్జెంట్ గా ఈ పదానికి అర్థమేంటి.. అసలు ఎందుకు చేశారో ఎక్స్ పర్ట్స్ తో తక్షణమే విచారణ జరిపించాలని ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు. ఇదీ మూడు రోజుల క్రితం యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్ ట్విట్టర్ ఖాతా నుండి వచ్చిన ఒక ట్వీట్ రేపిన దుమారం.

ఓ చిన్నారి చేసిన చిన్న ట్వీట్ అమెరికా ఉన్నతాధికారులను హడలెత్తించింది. చివరికి అదేదో అర్థం పర్ధం లేని.. అనుకోకుండా వచ్చిన ట్వీట్ అని తేలడంతో యావత్ దేశమే అవాక్కయింది. అసలు విషయం ఏమిటంటే.. అమెరికా అణ్వాయుధాల‌ను యూఎస్ స్ట్రాటజిక్ క‌మాండ్ అనే సంస్థ నిర్వహిస్తుంది. ఆ సంస్థ ట్విట్టర్ ఖాతా నుండి మార్చి 28న సాయంత్రం ;l;;gmlxzssaw, అనే పదం ఒకటి పబ్లిష్ అయింది. దేశభద్రతకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించే సంస్థ కావడం.. ఆ సంస్థ ట్విట్టర్ హ్యాండిల్ నుండి వచ్చిన మెసేజ్ కావడంతో ఈ పదం ఏంటని అధికారులు అలెర్ట్ అయ్యారు. ఇదేమైనా ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసి చేసిన ట్వీటా.. లేక రాజకీయ కుట్రదారుల పనా అని రకరకాలుగా అన్వేషణ మొదలు పెట్టారు.

Us Strategic

Us Strategic

అర్థం కాని భాష‌లో ఉన్న ఆ ట్వీట్ కొన్ని నిమిషాల పాటు అమెరికా భద్రతను చూసే అధికారులను చాలా గంద‌ర‌గోళానికి గురి చేసింది. ఆ ట్విట్టర్ ఖాతాను ఫాలో చేసే సాధారణ ప్రజలు సైతం ఆ ట్వీట్ కొచ్చిన అనుమానపు రీ ట్వీట్స్ తో హడలెత్తిపోయారు. కానీ చివ‌రికి అంతా ఉత్తుత్తిదే.. అదేదో చిన్న పాప చూసుకోకుండా చేయి తగిలి వచ్చిన ట్వీట్ అని యూఎస్ స్ట్రాటజిక్ క‌మాండే ప్రకటించి.. ఆ ట్వీట్ డిలేట్ చేయడంతో అధికారులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటే.. కొందరు సిటిజన్స్ అదే ట్విట్టర్ లో ఆ సంస్థను ఆగ్రహంతో ఏకిపారేస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే.. యూస్ స్ట్రాటజిక్ కమాండ్ ఉద్యోగి ఇంట్లో నుండి పనిచేస్తుండగా ఆ ఉద్యోగి కుమార్తె పొరపాటున ఈ ట్వీట్ చేసిందట.

యూస్ స్ట్రాటజిక్ కమాండ్ సంస్థ అంటే అమెరికా మిలిట‌రీకి సంబంధించిన అణ్వాయుధాలు, మిస్సైల్ డిఫెన్స్‌ల‌ను నిర్వహించే సంస్థ. అలాంటి సంస్థ ట్విట‌ర్ హ్యాండిల్ నుంచి వ‌చ్చే ప్ర‌తి ట్వీట్‌నూ ప్ర‌పంచ‌మంతా ఆస‌క్తిగా చూస్తుంది. అలానే ;l;;gmlxzssaw, అనే పదంతో వచ్చిన ట్వీట్ కూడా ప్రపంచమంతా జుట్టుపీక్కోనేలా ఆలోచనలో పడేసింది. ఇక అధికారులలో ఈ ట్వీట్ ఏంటా అని కాసేపు గందరగోళమైంది. కానీ చివరికి ఇది పొరపాటు కావడంతో అంతా సైలెంట్ అయిపోయారు. కానీ యూస్ స్ట్రాటజిక్ కమాండ్ సంస్థ ట్విట్టర్ హ్యాండిల్ నుండే ఇలాంటి పొరపాటు ట్వీట్స్ రావడంపై ప్రజలు ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.