Chiranjeevi : దేవుడు నేను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు.. మళ్ళీ ఈ పెద్దరికరం వద్దు.. చిరంజీవి!

హైదరాబాద్ లో సినీ వర్కర్స్ కోసం కట్టిన చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకాగా, కార్యక్రమంలో మాట్లాడుతూ..

Chiranjeevi : దేవుడు నేను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు.. మళ్ళీ ఈ పెద్దరికరం వద్దు.. చిరంజీవి!

Chiranjeevi comments about industry head

Chiranjeevi : హైదరాబాద్ లో సినీ వర్కర్స్ కోసం కట్టిన చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. దాదాపు 22 ఏళ్ళ సినీ కార్మికుల కల ఇవాళ నిజం కాబోతుండడంతో, చిత్రపురిలో సంబరాలు నెలకొన్నాయి. ఇక ఈ కార్యక్రమానికి అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజ్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు.

Chiranjeevi : చిత్రపురి కాలనీ సామూహిక గృహ ప్రవేశం.. రిబ్బన్ కట్ చేసిన చిరంజీవి!

ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. “22 ఏళ్ళగా ఎదురు చూస్తున్న సినీ కార్మికుల సొంత ఇంటి కల ఇవాళ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికి నా అభినందనలు. అయితే ఈ కలకి పునాది వేసిన డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. సినీ కార్మికులకు ఒక నీడ కలిపించాలి అంటూ అయన తీసుకున్న ఒక నిర్ణయం ఎంతోమందికి ఇలా సహాయపడుతుంది. భారతదేశంలో ఏ సినీపరిశ్రమ ఇలా సినీ కార్మికులకు ఇల్లు కట్టించలేదు” అంటూ ప్రశంసించాడు చిరంజీవి.

కాగా వేదికపై కొంతమంది చిరంజీవిని సినీ పెద్దగా అభివర్ణించగా, చిరు స్పందిస్తూ.. “సినీ పెద్ద అనే సీట్ మీద కూర్చొని, అలా ఒక పెద్దరికం అనుభవించాలని నాకు లేదు. నా కుటుంబసభ్యులు అనుకునే ఈ సినీ కార్మికుల కోసం నేను ఇప్పుడు భుజం కాస్తాను. దేవుడు నేను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడు. కాబట్టి మళ్ళీ నాకు ఇప్పుడు ఈ పెద్దరికరం అనే ఒక హోదా వద్దు” అంటూ వెల్లడించాడు.