Chiranjeevi : నేనొక నటుడిని, అసలు మొఖం పోగొట్టుకున్న అమాయకుడిని.. చిరంజీవి!

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా ఈ దర్శకుడు ‘రంగమార్తాండ’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమా కోసం మెగా స్టార్ చిరంజీవి..

Chiranjeevi : నేనొక నటుడిని, అసలు మొఖం పోగొట్టుకున్న అమాయకుడిని.. చిరంజీవి!

Chiranjeevi voice over for Ranga Maarthaanda

Chiranjeevi : టాలీవుడ్ ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతున్నాడు. కుటుంబ కథలు నుంచి దేశభక్తి కథలు వరకు తనదైన శైలిలో క్రియేటివ్‌గా తెరకెక్కించడం కృష్ణవంశీ స్టైల్. తాజాగా ఈ దర్శకుడు ‘రంగమార్తాండ’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రంగస్థల నాటకం బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్ వంటి హేమాహేమీ నటులు నటిస్తున్నారు.

Mega Family : సీక్రెట్ శాంటా కోసం గ్యాంగ్ అప్ అయిన మెగా ఫ్యామిలీ..

కాగా మెగా స్టార్ చిరంజీవి.. రంగమార్తాండ కవితాఝరి వర్ణించడానికి తన గొంతుని సవరించాడు. నేనొక నటుడిని అంటూ సాగే ఆ కవితా గీతాన్ని దర్శకుడు కృష్ణవంశీ నేడు విడుదల చేశాడు. అయితే ఈ కవితాఝరిలోని ప్రతి అక్షరం, ప్రతి పధం.. రంగమార్తాండ సోల్‌ని కాకుండా చిరంజీవి సోల్‌ని వర్ణించేలా ఉంది. నేనొక నటుడిని.. “చమ్కీల బట్టలు వేసుకొని, అట్ట కిరీటం పెట్టుకొని, చెక్క కత్తి పట్టుకొని, కాగితం పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను” అంటూ మొదలైన కవిత ఒక నటుడి జీవితాన్ని అందంగా వివరించింది.

నేనొక నటుడిని.. నాది కానీ జీవితాలకు జీవం పొసే నటుడిని. వేషం కడితే అన్ని మతాల దేవుడిని, వేషం తీస్తే ఎవ్వరికి కానీ జీవుడిని. హరివిల్లుకి ఇంకో రెండు రంగులు వేసి నవరసాలు మీకు అందిస్తాను కానీ నేను మాత్రం నలుపుతెలుపుల గందరగోళంలో బ్రతుకుతుంటాను.

“నేనొక నటుడిని.. అసలు మొఖం పోగొట్టుకున్న అమాయకుడిని కానీ తొమ్మిది తలలున్న నట రావణుడిని, నింగి-నెల రెండు అడుగులైతే మూడో పాదం మీ మనసులపై మోపే వామనుడిని” అంటూ కళాకారుడి అంతరార్ధాన్ని తెలియజేసేలా ఉంది ఈ కవితాఝరి.