Waltair Veerayya : షో ఆలస్యం.. వీరయ్య అభిమానుల ఆగ్రహం.. థియేటర్ అద్దాలు ధ్వంసం..

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'వాల్తేరు వీరయ్య' ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక పలు చోట్ల బెన్ఫిట్ షోలు కూడా పడడం, చాలా రోజుల తరువాత చిరంజీవి కూడా ఊర మాస్ లుక్ లో కనిపిస్తుండడంతో సినిమాని ముందుగానే చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరు లోని శ్రీ లక్ష్మి థియేటర్ లో బెన్ఫిట్ షో ఏర్పాటు చేశారు థియేటర్ యాజమాన్యం.

Waltair Veerayya : షో ఆలస్యం.. వీరయ్య అభిమానుల ఆగ్రహం.. థియేటర్ అద్దాలు ధ్వంసం..

Waltair Veerayya

Updated On : January 13, 2023 / 1:02 PM IST

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈరోజు రిలీజ్ కావడంతో మెగా అభిమానులు అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. ఇక పలు చోట్ల బెన్ఫిట్ షోలు కూడా పడడం, చాలా రోజుల తరువాత చిరంజీవి కూడా ఊర మాస్ లుక్ లో కనిపిస్తుండడంతో సినిమాని ముందుగానే చూసేందుకు అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరు లోని శ్రీ లక్ష్మి థియేటర్ లో బెన్ఫిట్ షో ఏర్పాటు చేశారు థియేటర్ యాజమాన్యం.

Waltair Veerayya Review : తమ్ముడు కోసం అన్నయ్య చేసే పోరాటమే వాల్తేరు వీరయ్య.. వింటేజ్ కామెడీ యాక్షన్ బాస్ ఈజ్ బ్యాక్..

అయితే సాంకేతిక లోపంతో షో వేయడం ఆలస్యం అయింది. ఎంతసేపు అయిన థియేటర్ మేనేజ్‌మెంట్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడం, షో కూడా వేయకపోవడంతో అభిమానులు ఆగ్రహం చెందారు. కోపంతో థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో థియేటర్ వద్ద కొంతసేపు గందరగోళంతో ఉద్రిక్త వాతావరణం నెలకుంది. ఇక ఈ వార్త తెలుసుకున్న పోలీసులు థియేటర్ కి చేరుకొని ఫ్యాన్స్ ని అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవిగా అభిమానులకు పూనకాలు తెప్పించాడు అంటున్నారు మూవీ చుసిన వాళ్ళు. హీరో రవితేజ, చిరంజీవికి తమ్ముడు పాత్రలో నటించాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మూవీకే హైలైట్ అంటున్నారు. ఇక చిరంజీవి కామెడీ టైమింగ్ అందర్నీ నవ్విస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగొట్టేశాడు. కమ్ బ్యాక్ తరువాత చిరంజీవి నుంచి ఒక కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా అంటున్నారు అభిమానులు. మరి చూడాలి సంక్రాంతి విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో.