Mauro Morandi: మనిషి కనిపించకుండా 33ఏళ్ల పాటు అడవిలో గడిపిన 82ఏళ్ల వ్యక్తి కొత్త జీవితం

మౌరో 1989లో స‌ముద్ర మార్గం గుండా ఇటలీ నుంచి పోలినేషియాలోని త‌న స్వ‌స్థ‌లానికి వెళ్తుండ‌గా సార్డినియ‌న్ దీవిని చూశాడు.

Mauro Morandi: మనిషి కనిపించకుండా 33ఏళ్ల పాటు అడవిలో గడిపిన 82ఏళ్ల వ్యక్తి కొత్త జీవితం

Mauro Island

Mauro Morandi: ఐదు కాదు.. పది కాదు ఏకంగా 33ఏళ్ల పాటు అడవిలోనే గడిపేశాడా వ్యక్తి. బుడెల్లిలోని సార్డినియ‌న్ దీవిలో మౌరో మొరాండి అనే 82సంవత్సరాల ఉన్న వ్య‌క్తి అడవిలోనే ఏకాంతంగా ఉండిపోయాడు. అడ‌వి ప‌క్షులు, అడ‌వి పిల్లులే అతని నేస్తాలయ్యాయి. ఒక్క‌ మ‌నిషితో కూడా కలవకుండా.. మాట్లాడకుండా ఉండి తిరిగి న‌గ‌రానికి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు.

మౌరో 1989లో స‌ముద్ర మార్గం గుండా ఇటలీ నుంచి పోలినేషియాలోని త‌న స్వ‌స్థ‌లానికి వెళ్తుండ‌గా సార్డినియ‌న్ దీవిని చూశాడు. ఆ దీవిలోని సుంద‌ర దృశ్యాలు, విన‌సొంపైన శ‌బ్దాలు అక్క‌డే ఉండిపోయేలా ప్రేరేపించాయి. అలా దశాబ్దాల పాటు గడిపిన త‌ర్వాత ఆ దీవిని ఖాళీ చేసి జ‌నాల మధ్యకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వ‌చ్చింది.

మీరు కూడా 80 ఏళ్లు దాటినప్ప‌టికీ మ‌ళ్లీమ‌ళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించ‌వ‌చ్చ‌ని మౌరో చెబుతున్నాడు. ఎందుకంటే ఆ కొత్త జీవితంలో ఎన్నో కొత్త అనుభ‌వాలు తెలిసొస్తాయ‌ని, పూర్తిగా భిన్న‌మైన ప్ర‌పంచాన్ని చూసే అవ‌కాశం దొరుకుతుంద‌ని మైరో అభిప్రాయ‌ప‌డ్డాడు. దీవిలో ఉన్న సమయంలో మౌరో త‌న అనుభ‌వం మొత్తాన్ని ఒక పుస్త‌కం రూపంలో విడుదల చేశాడని వార్త‌లు వినిపిస్తున్నాయి.

………………………………… : ఆ ముద్దు సీన్లు ఎలా చేశామంటే..

ఇటీవ‌ల స్థానిక అధికారులు సార్డినియ‌న్ దీవిని ఎన్విరాన్‌మెంట‌ల్ అబ్జ‌ర్వేట‌రీగా మార్చాల‌ని నిర్ణ‌యించ‌డంతో.. మౌరోకు అక్కడి త‌న ఆవాసాన్ని ఖాళీ చేయ‌డం త‌ప్ప మ‌రో గ‌త్యంత‌రం లేకుండా పోయింది. మౌరో గ‌త మే నెల‌లో లా మద్దలీనా దీవికి వెళ్లాడు. అక్క‌డ త‌న పెన్ష‌న్ డ‌బ్బుల‌తో ఓ ఇల్లు కొనుక్కున్నాడు. త‌న ఇరుగుపొరుగు వారితో మాట్లాడ‌టం మొద‌లుపెట్టాడు.

జీవితంలో వ‌చ్చిన ఆక‌స్మిక మార్పు గురించి మౌరో ఓ మీడియాతో మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం సార్డినియ‌న్ దీవిలో ఏకాంత జీవ‌నం గ‌డిపాను. బుడెల్లి దీవికి వ‌చ్చిన త‌ర్వాత చాలా రోజులు ఇత‌రుల‌తో మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌లేదు. నా జీవితం కొత్త మ‌లుపు తిరిగింది. ఇప్పుడిప్పుడే ఇత‌రుల‌తో మాట్లాడేందుకు, వారితో క‌లిసిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నానని చెప్పాడు.