Ladli Behna Yojana: మధ్యప్రదేశ్‌లో సీఎం చౌహాన్ ఎన్నికల తాయిలాలు..లాడ్లీ బెహనా యోజన పథకం

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల తాయిలాలు ప్రకటించింది. మహిళా ఓటర్లకు ఆకట్టుకునేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ చౌహాన్ లాడ్లీ బెహనా యోజన పథకాన్ని ప్రకటించారు....

Ladli Behna Yojana: మధ్యప్రదేశ్‌లో సీఎం చౌహాన్ ఎన్నికల తాయిలాలు..లాడ్లీ బెహనా యోజన పథకం

Ladli Behna Yojana

Updated On : June 11, 2023 / 7:10 AM IST

Ladli Behna Yojana: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల తాయిలాలు ప్రకటించింది. మహిళా ఓటర్లకు ఆకట్టుకునేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ చౌహాన్ లాడ్లీ బెహనా యోజన పథకాన్ని ప్రకటించారు.(CM Shivraj Chouhan releases) ఈ పథకం కింద ప్రస్థుతం మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1000లను జమ చేశారు.భవిష్యత్ లో ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.3వేలకు పెంచుతామని సీఎం ప్రకటించారు.

Cyclone Biparjoy to intensify : పోర్‌బందర్ తీరాన్ని తాకనున్న బిపర్ జోయ్ తుపాన్

మహిళల సంక్షేమానికి ఈ పథకం ఉపయోగ పడుతుందని సీఎం చెప్పారు. (Madhya Pradesh)21 ఏళ్ల వయసు మహిళల నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కన్యాదాన్ పథకం కింద ఈ మహిళలు లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నారీ సమ్మాన్ యోజన పథకం కింద నెలకు 1500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ అధినేత కమలనాథ్ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సీఎం చౌహాన్ నెలకు వెయ్యిరూపాయల చొప్పున మహిళలకు ఇచ్చేలా లాడ్లీ బెహనా పథకాన్ని అమలు చేశారు. మొత్తంమీద ఎన్నికల నేపథ్యంలో సర్కారు ఎన్నికల తాయిలాల వర్షం కురిపిస్తోంది.