Pratik sanghar : నా ఐడియాను దొంగలించారు.. మరో వివాదంలో ఆదిపురుష్..
తాజాగా ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో నిలిచింది. ప్రతీక్ అనే ఓ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ డిజైనర్ ఆదిపురుష్ టీం తన డిజైన్స్ ని, డ్రాయింగ్స్ ని కాపీ కొట్టిందని ఆరోపించాడు.

Concept artist Pratik Sanghar has accused Adipurush team of copying his work
Pratik sanghar : ప్రభాస్(Prabhas) హీరోగా రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). కృతిసనన్(Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ని రాముడిగా చాలా గొప్పగా ఊహించుకున్నారు అభిమానులు, ప్రేక్షకులు. కానీ టీజర్ రిలీజ్ తర్వాత అంతా ఆశ్చర్యపోయారు.
రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది అని విమర్శలు వచ్చాయి. పోనీ అలా అయినా రామాయణం చూపిస్తారు అనుకుంటే రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని మరింతమంది విమర్శించారు. ఇలా అన్ని వైపులా ఆదిపురుష్ వివాదాల్లో నిలిచింది. అంతే కాకుండా హిందూ మనోభావాలు దెబ్బ తీశారని పలువురు ఆదిపురుష్ సినిమాపై పలుచోట్ల కేసులు కూడా నమోదు చేశారు.
Balagam : ఒకే ఫిలిం ఫెస్టివల్ లో 9 ఇంటర్నేషనల్ అవార్డులు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన బలగం..
తాజాగా ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో నిలిచింది. ప్రతీక్ అనే ఓ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ డిజైనర్ ఆదిపురుష్ టీం తన డిజైన్స్ ని, డ్రాయింగ్స్ ని కాపీ కొట్టిందని ఆరోపించాడు. కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ప్రతీక్ సంఘర్ తన గీసిన కొన్ని రాముడి ఫోటోలను షేర్ చేస్తూ.. నేను ఇండియాకు చెందిన ఆర్టిస్ట్ ని. రామాయణంలో శ్రీరాముడిని నా ఊహల్లో సరికొత్త రూపం ఇవ్వడానికి సంవత్సరం క్రితమే వీటిని గీసాను. కానీ ఆదిపురుష్ టీంలో పనిచేసే ఆర్టిస్ట్ TP విజయన్ నా ఆర్ట్ ని కాపీ కొట్టారు. నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అసలు నా అనుమతి లేకుండా నా కళను ఎలా దొంగిలిస్తారు అంటూ చిత్రయూనిట్ పై ఫైర్ అయ్యాడు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.
ఇప్పటికే ఆదిపురుష్ పై నెగిటివ్ ఉండటంతో కొంతమంది ప్రతీక్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుండగా, మరికొంతమంది మాత్రం ఆదిపురుష్ సినిమా రెండేళ్ల క్రితమే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది, నువ్వు సంవత్సరం క్రితం గీశావని చెప్తున్నావ్ అంటూ ప్రతీక్ కి వ్యతిరేకంగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రతీక్, TP విజయన్ పోస్ట్ చేసిన రాముడు ఆర్ట్స్ రెండూ దాదాపు ఒకేలా ఉన్నాయి. ప్రతీక్ సంవత్సరంన్నర క్రితమే తన సోషల్ మీడియాలో వీటిని పోస్ట్ చేయగా, TP విజయన్ కొన్ని నెలల క్రితం వీటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో నిజంగానే కాపీ కొట్టారా అని అంతా అనుకుంటున్నారు. మరి దీనిపై చిత్రయూనిట్ కానీ ఆర్టిస్ట్ TP విజయన్ కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
View this post on Instagram