Corona Positive : హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన 12మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన 12మంది విదేశీ ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. ఎయిర్ పోర్టులో దిగిన విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయగా 12 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.

Corona Positive : హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన 12మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్

Hyderabad Airport

Corona for 12 foreign passengers : హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన 12మంది విదేశీ ప్రయాణికులు కరోనా బారిన పడ్డారు. ఎయిర్ పోర్టులో దిగిన విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయగా 12 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇవాళ ఒక్క రోజే ఏడుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. దీంతో ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 12మందికి కరోనా పాజిటివ్ గా అధికారులు తేల్చారు. కరోనా బాధితులను అధికారులు టిమ్స్ కి తరలించారు. వీరిలో యూకే నుంచి 9, సింగపూర్ నుంచి ఒక్కరు, కెనడా నుంచి ఒక్కరు, అమెరికా నుంచి ఒక్కరు ఇప్పటివరకు వచ్చినవారిలో ఉన్నారు. వీరి శాంపుల్స్ ని జినోమ్ సీక్వెన్స్ కి అధికారులు పంపారు.

బుధవారం(డిసెంబర్1, 2021)న బ్రిటన్, సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు శంషాబాద్ లో టెస్టులు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే ఆమెను గచ్చిబౌలి టిమ్స్ కు తరలించారు. శాంపిళ్లను సీసీఎంబీలో జీనోమ్ సీక్వెన్స్ కోసం తెలంగాణ వైద్య శాఖ పంపింది. ఈ విషయాన్ని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం (డిసెంబర్2, 2021)న ఆయన మీడియాకు వెల్లడించారు.

Biswajit Das Gupta : కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలు జరపట్లేదు : నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా

ప్రస్తుతం కరోనా బాధితురాలు గచ్చిబౌలి టిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇటీవల బ్రిటన్‌, సింగపూర్ నుంచి 325 మంది ప్రయాణికులు తెలంగాణకు వచ్చారని..వారందరికీ టెస్టులు నిర్వహించామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. 239 మంది ప్రయాణికులు హైదరాబాద్ వాసులని, మిగిలిన వారు ఇతర రాష్ట్రాల ప్రయాణికులని చెప్పారు. ఒమిక్రాన్ మూడు రోజుల్లోనే 24 దేశాలకు వ్యాపించిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ హెచ్చరించారు.

భారత్‌కు ఒమిక్రాన్ ముప్పు ఎప్పుడైనా రావొచ్చన్నారు. ముప్పు నుంచి తప్పించుకోవాలంటే కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఒమిక్రాన్ పై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తున్నారని డీహెచ్ శ్రీనివాస్ తెలిపారు. క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని… రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని పేర్కొన్నారు.