Tollywood : ‘సినిమా’ వాళ్లకే ‘సినిమా’ చూపిస్తున్న సెకండ్ వేవ్..

లాస్ట్ ఇయర్ మిస్ అయిన సినిమాలన్నీ ఈ సంవత్సరం డబుల్ ఎనర్జీతో, డబుల్ కలెక్షన్లతో రాబోతున్నాయని ఆనందపడుతున్న టాలీవుడ్‌ని మళ్లీ కరోనా భయం వెంటాడుతోంది..

Tollywood : ‘సినిమా’ వాళ్లకే ‘సినిమా’ చూపిస్తున్న సెకండ్ వేవ్..

Tollywood

Tollywood: లాస్ట్ ఇయర్ మిస్ అయిన సినిమాలన్నీ ఈ సంవత్సరం డబుల్ ఎనర్జీతో, డబుల్ కలెక్షన్లతో రాబోతున్నాయని ఆనందపడుతున్న టాలీవుడ్‌ని మళ్లీ కరోనా భయం వెంటాడుతోంది. కేసులు పెరగడంతో పాటు, పోస్ట్ పోన్ అవుతున్న సినిమాలు, థియేటర్ల బంద్‌తో టెన్షన్‌లో ఉంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. దాంతో వెయ్యి కోట్లకు పైనే నష్టాల్ని ఎదుర్కొంటోంది టాలీవుడ్. మరి ఈ నష్టం ఇంతటితో ఆగే ఛాన్సుందా..?

కరోనా సెకండ్ వేవ్‌తో హడలి పోతోంది టాలీవుడ్. కరోనా కేసులు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ అవుతుండడంతో టెన్షన్ పడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఆంధ్రాలో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో, తెలంగాణలో మొత్తానికి థియేటర్ల బంద్‌తో నష్టాల్ని ఎదుర్కొంటోంది తెలుగు సినిమా. ఇప్పటికే ఈ సంవత్సరం వెయ్యి కోట్ల నుంచి 1200 కోట్ల మార్కెట్ మిస్ అయ్యామని టాలీవుడ్ మేకర్స్ అంటున్నారు.

రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన సినిమాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు నిర్మాతలు.. ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’, ‘తలైవి’, ‘టక్ జగదీష్’, ‘విరాట పర్వం’ సినిమాలు వచ్చే నెల 13న రిలీజ్ కానున్న చిరంజీవి ‘ఆచార్య’ సినిమా రిలీజ్ అవ్వడం కూడా డౌటే అంటున్నారు. ఈ సినిమాలే కాదు, పెద్ద సినిమాలు కూడా అనౌన్స్ చేసిన డేట్‌కు విడదలయ్యే అవకాశాలు కూడా తక్కువగానే కనిపిస్తున్నాయి. సినిమాలకు పెద్ద సీజన్ అయిన సమ్మర్ ఈ సారి కూడా మిస్ అవ్వడంతో ఈ నష్టం ఇంకా పెరిగే ఛాన్సుందని వర్రీ అవుతున్నారు మేకర్స్.

కరోనా కారణంగా కేవలం తెలుగు ఇండస్ట్రీనే కాదు.. అన్ని ఇండస్ట్రీలు నష్టపోతున్నాయి. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీ కూడా దాదాపు వెయ్యి కోట్ల దాకా నష్టాలు చూస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటకల్లో యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ రన్ అవుతున్నాయి. ఇక ఇండియన్ సినిమాకి పెద్ద మార్కెట్ అయిన బాలీవుడ్ ఇప్పటికే రిలీజులు పోస్ట్ పోన్, షూటింగ్స్ ఆపేయ్యడంతో దాదాపు 4 వేల కోట్లు నష్టపోయిందని సమాచారం..