Corona Wedding: ఇన్‌స్టాగ్రామ్ లైవ్​లో పెళ్లి.. మై విలేజ్ షో అనిల్ లగ్నపత్రిక వైరల్!

ముహుర్తాలు మొదలవుతున్నాయి. కరోనా ఏమో భయపెడుతుంది. ఈ సమయంలో పెళ్లి చేసుకోవాలా వద్దా.. ఒకవేళ చేసుకోవాలంటే ఎలా చేసుకొని కరోనాను దొరకకుండా బయటపడాలి అనే ఆలోచనలతో పెళ్లిళ్లు నిర్ణయమైన యువతీ, యువకులు డైలమాలో ఉన్నారు.

Corona Wedding: ఇన్‌స్టాగ్రామ్ లైవ్​లో పెళ్లి.. మై విలేజ్ షో అనిల్ లగ్నపత్రిక వైరల్!

Corona Wedding Wedding On Instagram Live My Village Show Anil Wedding Card Goes Viral

Corona Wedding: ముహుర్తాలు మొదలవుతున్నాయి. కరోనా ఏమో భయపెడుతుంది. ఈ సమయంలో పెళ్లి చేసుకోవాలా వద్దా.. ఒకవేళ చేసుకోవాలంటే ఎలా చేసుకొని కరోనాను దొరకకుండా బయటపడాలి అనే ఆలోచనలతో పెళ్లిళ్లు నిర్ణయమైన యువతీ, యువకులు డైలమాలో ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వాలేమో నిబంధనలు విధించగా అందుకు అనుగుణంగా పెళ్లి ఎలా చేసుకోవాలా అని ఆలోచనలు సాగుతున్నాయి. అయితే.. ఇలాంటి సమయంలో కరోనా పరిస్థితులకు అనుగుణంగా జరగనున్న ఓ పెళ్లి పత్రిక ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ పెళ్లి పత్రిక కూడా వైవిధ్యంగా.. అచ్చమైన తెలంగాణ భాషలో.. కరోనా సమయంలో ఎలా పెళ్లి చేసుకోవాలా కళ్ళకు కట్టినట్లుగా చెప్పడంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ లగ్న పత్రిక ఎవరిదో కాదు.. యూట్యూబ్లో ఫెమస్ అయిన మై విలేజ్ షో ఫేమ్ అనిల్ దే. మామూలుగానే కాస్త డిఫరెంట్ గా ఆలోచించే మై విలేజ్ షో టీమ్ అనిల్ పెళ్లిని మరికాస్త డిఫరెంట్ గా అలోచించి కరోనా కారణంగా పెళ్లిని ఇన్ స్టాగ్రామ్ లైవ్ ప్రసారమయ్యేలా ప్లాన్ చేశారు. ఇదే విషయాన్ని.. కరోనా పరిస్థితికి జోడించి వెడ్డింగ్ కార్డును రూపొందించారు.

Corona Wedding

Corona Wedding

సాధారణంగా ఏ పెళ్లి పత్రికలో చూసినా శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అంటూ మొదలుపెడతారు. కానీ ఈ కరోనా పెళ్లి పత్రికలో మాత్రం శానిటైజర్ ఫస్టు.. మాస్క్ మస్టు.. సోషల్ డిస్టెన్స్ బెస్ట్ అంటూ కరోనా నిబంధనల గురించి మొదలుపెట్టి, వధూవరుల అర్హతల దగ్గర కరోనా నెగిటివ్ అని రాయించడం, పెండ్లిని ఆన్‌‌లైన్‌లో చూసి ఆశీర్వదించి, ఎవరింట్లో వారే విందు తిని.. ఎవరింట్లో వాళ్లే పాటలు పెట్టుకొని బరాత్ డాన్స్ చేయాలని చెప్పుకొచ్చారు. కట్నాలు, కానుకలకు డిజిటల్ చెల్లింపులు చేయాలని.. అందుకు జీపే, ఫోన్ పే బార్ కోడ్ కూడా అచ్చేశారు.

అలా వచ్చే కట్న కానుకలను కరోనాతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయంగా అందిస్తామని కూడా ఈ పెండ్లి పత్రికలో ముద్రించారు. మొత్తంగా ప్రస్తుత కరోనా పరిస్థితులకు అద్దం పట్టేలా ‘కరోనా కాలంలో లగ్గం పత్రిక’ అని పెళ్లి పత్రికపై రాసి ఫన్నీగానే ఉంటూ పరిస్థితులకు తగ్గట్లు ఎలా నడుచుకోవాలో ఆలోచింపజేసేలా తయారుచేసిన ఈ క్రియేటివ్ పెళ్లి పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ లైవ్ పెళ్లిని చూసి త్వరలోనే పెళ్లి చేసుకోబోయే వారిలో కొందరైనా ఈ ట్రెండ్ ఫాలో అవుతారేమో చూడాలి!

Read: MS Raju Film: క్యూరియాసిటీ రేకెత్తిస్తున్న ‘7 డేస్.. 6 నైట్స్’!

Read: Actor Siddharth: చంపేస్తామని బెదిరింపు కాల్స్.. అయినా తగ్గేదేలేదు!