Actor Siddharth: చంపేస్తామని బెదిరింపు కాల్స్.. అయినా తగ్గేదేలేదు!
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓయ్, బావా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్ మహాసముద్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కాగా.. ఇప్పుడు సిద్దార్ధ్ కు ఓ చేదు అనుభవం ఎదురైందట. తనకు నిత్యం వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

Actor Siddharth Receives Death Threats Tn Bjp Leaked My Number Tweets Siddharth
Actor Siddharth: నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓయ్, బావా సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో సిద్దార్ధ్ ఈ మధ్య కాస్త వెనకబడ్డాడు. చాలాకాలంగా తెలుగుకు దూరమైన సిద్దార్ధ్ ఇప్పుడు మళ్ళీ శర్వానంద్ తో కలిసి మహాసముద్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. కాగా.. ఇప్పుడు సిద్దార్ధ్ కు ఓ చేదు అనుభవం ఎదురైందట. తనకు నిత్యం వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
కరోనా సెకండ్ వేవ్ తో దేశం అల్లకల్లోల పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై తన గళాన్ని వినిపిస్తున్న సిద్దార్ధ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటికే పలుమార్పు సిద్దార్ధ్ విమర్శలకు తమిళనాడు బీజేపీ నేతలు కౌంటర్లు వినిపించారు. కాగా ఇప్పుడు బీజేపీ నేతలే తన ఫోన్ నెంబర్ కావాలని లీక్ చేసి రాంగ్ కాల్స్ చేసి తిడుతున్నారని ఆరోపిస్తున్నాడు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన సిద్దార్ధ్ తనకు 500 పైగా నంబర్స్ నుండి కాల్స్ చేసి తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని తిడుతూ బూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
https://twitter.com/Actor_Siddharth/status/1387653507814072325
తన ఫోన్ నెంబర్ తమిళనాడు బీజేపీ, తమిళనాడు బీజేపీ ఐటీ విభాగం కావాలనే లీక్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. తనకు వచ్చిన ఫోన్ కాల్స్ రికార్డ్ చేసి ఉంచానని.. ఆ రికార్డింగ్స్ తో పాటు తమిళనాడు బీజేపీ తనను ఉద్దేశ్యపూర్వకంగా అవమాన పరుస్తూ పెడుతున్న సోషల్ మీడియా పోస్ట్స్ లింక్స్ పోలీసులకు సమర్పిస్తానని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారంపై వెనక్కి తగ్గేది లేదన్న సిద్ధార్థ్ మీ ప్రయత్నం మీరు చేసుకోండి నా పని చేసుకుంటా అంటూ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.