Cristiano Ronaldo: రొనాల్డో ఒక్కసారి ఐస్ బాత్ కోసం రూ.51లక్షలు

మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రైకర్ క్రిస్టియన్ రొనాల్డో.. ఐస్ బాత్ చేయడం కోసం ఎంత ఖర్చుపెట్టాడో తెలుసా. ఇటలీ నుంచి తాను నివాసం ఉంటున్న ఇంటికి రూ.51లక్షలు ఖర్చు పెట్టి బాత్ టబ్.

Cristiano Ronaldo: రొనాల్డో ఒక్కసారి ఐస్ బాత్ కోసం రూ.51లక్షలు

Christian Ronaldo

Cristiano Ronaldo: మాంచెస్టర్ యునైటెడ్ స్ట్రైకర్ క్రిస్టియన్ రొనాల్డో.. ఐస్ బాత్ చేయడం కోసం ఎంత ఖర్చుపెట్టాడో తెలుసా. ఇటలీ నుంచి తాను నివాసం ఉంటున్న ఇంటికి రూ.51లక్షలు ఖర్చు పెట్టి బాత్ టబ్ తెప్పించుకున్నాడట. క్రియో థెరఫీ కోసం ఈ ప్రత్యేకమైన టబ్ తెప్పించుకున్నాడు. ఇందులో మైనస్ 200సెంటిగ్రేట్ వరకూ కూల్ అయి మానవ శరీర కణజాలం పునరుద్ధరిస్తుంది. గాయాలను మాన్పించి రోగ నిరోధక శక్తి పెంచుతుంది.

ఈ బాత్ కు వెళ్లే ముందు ఈ పోర్చుగల్ స్టార్ మిట్స్ (ప్రత్యేక కవచం) ధరించి టబ్ లో దిగుతాడట. వెంటనే టబ్ లో ఉన్న లిక్విడ్ నైట్రోజన్ రిలీజ్ అయి సిలిండర్ కూల్ చేయడంతో పాటు శరీరాన్ని కూడా చల్లబరుస్తుందట. సాధారణంగా యూజర్లు ఈ ఛాంబర్ లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండకూడదని.. అలా ఉంటే ఆరోగ్యానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

కానీ, అలా ఉంటే రక్త ప్రసరణ పెరిగి, రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందనే అపోహ లేకపోలేదు. అలా చేయడం వల్ల నీరసం తగ్గి, గాయాల నుంచి మనస్సుకు త్వరగా ఉపశమనం కలుగుతుందని అంటున్నారు.

………………………………………….: ముగ్గురు అమ్మాయిల కోసం దేవుడిగా మారిన సునీల్..!

2013లో రియల్ మాడ్రిడ్ జట్టుకు ఆడుతున్న సమయంలో నుంచి రొనాల్డో ఈ టెక్నిక్ వాడుతున్నాడు. డబ్బు ఖర్చు అనేది పక్కకుబెట్టి.. మ్యాచ్ అయిపోయిన తర్వాత తప్పకుండా చేసే రొటీన్ కోసం ఇలా చేయడం సంతోషంగా ఉంది. ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది పీక్స్ లో ఉండాలని రొనాల్డో ఎప్పుడు పరితపిస్తూ ఉంటాడని సిబ్బంది అంటున్నారు.

రొనాల్డొ 36 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా కనిపించడానికి ఈ ఐస్‌బాత్‌ టబ్‌ ఒక కారణమట. రొనాల్డొ తాజాగా ప్రీమియర్‌ లీగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డును గెలుచుకున్నాడు.