Deepika Padukone: బ్రహ్మాస్త్ర పార్ట్-2లో హీరో తల్లిగా దీపికా.. ఆడియెన్స్ ఒప్పుకుంటారా?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే సినిమాలంటే నార్త్‌తో పాటు సౌత్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అమ్మడి అందాల విందుతో పాటు ఆమె సినిమాల్లో పర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుందనే భావన అభిమానుల్లో ఉండటంతో, ఆమె సినిమాలను ఖచ్చితంగా మిస్ కాకుండా చూస్తుంటారు.

Deepika Padukone: బ్రహ్మాస్త్ర పార్ట్-2లో హీరో తల్లిగా దీపికా.. ఆడియెన్స్ ఒప్పుకుంటారా?

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే సినిమాలంటే నార్త్‌తో పాటు సౌత్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అమ్మడి అందాల విందుతో పాటు ఆమె సినిమాల్లో పర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ ఉంటుందనే భావన అభిమానుల్లో ఉండటంతో, ఆమె సినిమాలను ఖచ్చితంగా మిస్ కాకుండా చూస్తుంటారు. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా కేరాఫ్‌గా దీపికా నిలుస్తుండటంతో ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Deepika Padukone : ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. మా అమ్మ నన్ను అర్ధం చేసుకోవడం వల్లే ఇవాళ ఇలా..

అయితే ఇప్పుడు ఈ బ్యూటీ త్వరలోనే ఓ యంగ్ హీరోకు తల్లి పాత్రలో నటించబోతున్నట్లు బి-టౌన్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను విజువల్ వండర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. బ్రహ్మాస్త్రలో పార్ట్-1లో శివ అనే పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించగా, పార్ట్-2లో శివ తల్లి పాత్ర ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Deepika Padukone: దీపికా ఆరోగ్యంపై అశ్వినీ దత్ క్లారిటీ..ఏమన్నారంటే?

కాగా, హీరో తల్లి పాత్రలో చాలా మంది పేర్లు వినిపించగా, ఇప్పుడు దీపికా పదుకొనేను ఓకే చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే గతంలో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సినిమాల్లో రొమాన్స్ చేసిన దీపికా ఇప్పుడు అతడికి తల్లి పాత్రలో నటించేందుకు ఒప్పుకుంటుందా.. ఒకవేళ ఒప్పుకున్నా, ఆడియెన్స్ ఈ కాంబినేషన్‌ను అంగీకరిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి బ్రహ్మాస్త్ర పార్ట్-2లో రణ్‌బీర్‌కు తల్లిగా ఎవరు నటిస్తారనే విషయం తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.