Dhanteras : ధంతేరాస్ : భారీగా పెరిగిన బంగారం కొనుగోళ్లు.. హాల్‌మార్క్ ఉంటేనే కొనేది!
ధనత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లలో కొత్త జోష్‌ను నింపింది. ధంతేరాస్ సందర్భంగా బంగారం, వెండి అమ్మకాలు జోరుగా సాగాయి. బంగారం ఆభరణాల కొనుగోళ్లు

Dhanteras Gold Prices Huge Hike
Dhanteras Gold Prices Hike : ధనత్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లలో కొత్త జోష్‌ను నింపింది. ధంతేరాస్ సందర్భంగా బంగారం, వెండి అమ్మకాలు జోరుగా సాగాయి. బంగారం ఆభరణాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. 2020 ఏడాదిలో కరోనా దెబ్బకు బంగారం డిమాండ్ భారీగా తగ్గిపోయింది. 2021 ఏడాదిలో బంగారం కొనుగోళ్లలో చాలా మార్పు వచ్చింది. బంగారం కొనేందుకు వస్తున్నవారి సంఖ్య ఎక్కువగా పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2020తో పోలిస్తే 40 శాతం బంగారం కొనుగోళ్లు పెరిగాయని, ఆన్‌లైన్ విక్రయాలు కూడా పెరిగాయని పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి నుంచి జ్యుయలరీ పరిశ్రమ కోలుకుందని అఖిలభారత ట్రేడర్ల సమాఖ్య (CAIT) పేర్కొంది. ధనత్రయోదశి రోజున దేశవ్యాప్తంగా రూ.7,500 కోట్ల విలువ కలిగిన సుమారు 15 టన్నుల బంగారం ఆభరణాల విక్రయాలు జరిగినట్టు CAIT తెలిపింది.
Read Also : Boiling Milk : పాలు పొంగితే..అలారం వస్తుంది…ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆవిష్కరణ
ప్రస్తుత త్రైమాసికం ఇటీవలి ఏళ్లల్లో బంగారం ధరలు మెరుగ్గానే ఉంటాయని అంచనా వేసింది. 2021 ఏడాదిలో ధనత్రయోదశితో పోలిస్తే.. బంగారానికి మంచి డిమాండ్ ఉందని పీసీ జ్యుయలర్స్ ఎండీ బలరామ్‌గార్గ్ తెలిపారు. ధంతేరాస్ సందర్భంగా వ్యాపారులు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఈసారి పండుగల సీజన్ సమయంలో బంగారానికి భారీ డిమాండ్ పెరిగిందని నగల వర్తకులు చెప్పారు. నగలతోపాటు నాణేలకూ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే కరోనాకు ముందున్న స్థాయిని ఈ ధంతేరాస్ విక్రయాలు తాకాయి. సాధారణంగా ధనత్రయోదశికి 20-30 టన్నుల బంగారం అమ్మకాలు జరుగుతాయి. ఈసారి మరింత ఎక్కువగా జరుగవచ్చని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా రాత్రి 8 గంటల వరకు 15 టన్నుల విక్రయాలు (రూ.75,000 కోట్లు) జరిగినట్టు నివేదిక వెల్లడించింది.
హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలే కొనాలని ప్రభుత్వం సూచిస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వద్ద నమోదైన వర్తకులకు చెందిన షాపుల్లో మాత్రమే హాల్‌మార్క్ ఆభరణాలను, కళాఖండాలను కొనుగోలు చేయాల్సిందిగా వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది. బంగారం కొనుగోలు చేసినప్పుడు బిల్లు/ఇన్వాయిస్ తప్పనిసరిగా తీసుకోవాలి. హాల్‌మార్క్ ఆభరణాల విక్రయంలో బిల్లు, ఇన్వాయిస్ జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేశవ్యాప్తంగా 256 జిల్లాల్లో 2021 జూన్ 23 నుంచి 14, 18, 22 క్యారట్ల ఆభరణాలకు హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నిరుడు ఆగస్టులో మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,000 పలికింది. అయితే మంగళవారం రూ.47,644 (పన్నులు అదనం)లుగానే ఉన్నది. ఇది కూడా కలిసొచ్చిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read Also : Gold Rates: పండక్కి ముందే తగ్గిన బంగారం ధరలు