Boiling Milk : పాలు పొంగితే..అలారం వస్తుంది…ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆవిష్కరణ
ఓ ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని చక్కటి పరిష్కారం చూపెట్టింది. పాలు పొంగగానే..అలారం వచ్చేలా తయారు చేసింది.

Milk
Boiling Milk Overflow : ప్రతింట్లో పాలు కంపల్సరీ ఉంటాయి. చిన్న పిల్లలు ఉండే ఇళ్లల్లో మిల్క్ మస్ట్. అయితే..పాలు తీసుకోగానే..కాగ పెడుతారు. కానీ..చాలా మంది ఇళ్లల్లో పాలు పొంగిపోతుంటాయి. దీని కారణంగా…చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పొంగడం వల్ల పాలు వృధా అవుతుంటాయి. పాలు పొంగి..గ్యాస్ లీక్ అవడం పలు సందర్భాల్లో జరుగుతుంటాయి. ఇది కొంత ప్రమాదకరమే.
Read More : Puneeth Rajkumar : పునీత్ సమాధి సందర్శనానికి అనుమతి
పాలు పొంగేటప్పుడు ఏదైనా హెచ్చరకలు లాంటి వస్తే బాగుంటుందని గృహిణులు కోరుకుంటుంటారు. అలాంటే ఓ వస్తువును తయారైంది. ఈ సమస్యకు ఓ ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని చక్కటి పరిష్కారం చూపెట్టింది. పాలు పొంగగానే..అలారం వచ్చేలా తయారు చేసింది.
హైదరాబాద్ లోని సీపీఎల్ అంబర్ పేట ప్రభుత్వ పాఠశాలలో రూప 9వ తరగతి చదువుతోంది. తన సహచర విద్యార్థులతో కలిసి..బాయిలింగ్ మిల్క్ ఓవర్ ఫ్లో ప్రివెన్షన్ సిస్టంను తయారు చేసింది.
Read More : WhatsApp : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. నో టైం లిమిట్.. ఎప్పుడైనా డిలీట్ చేయొచ్చు!
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా…పలు ప్రాజెక్టులను ప్రదర్శించారు. మొత్తం 400 ప్రాజెక్టులు ప్రదర్శించగా..అందులో తాను, తన సహచర విద్యార్థులతో కలిసి తయారు చేసిన ప్రాజెక్టును ప్రదర్శిచింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ప్రశంసించింది. రూప ప్రాజెక్టు టాప్ 4లో నిలవడం విశేషం.
Read More : Puneeth Rajkumar : 50 రకాల వంటకాలతో పునీత్ రాజ్ కుమార్ కి పూజలు
ఎలా పని చేస్తుంది ? :-
వాటర్/లిక్విడ్ సెన్సర్ ను పాలు వేడి చేస్తున్న పాత్ర పై భాగంలో ఉంచాల్సి ఉంటుంది. ఈ సెన్సర్లకు బజర్ కు కనెక్టు చేయాలి. పాలు పొంగి సెన్సర్లను తాకగానే..బజర్ శబ్ధం చేస్తుంది. దీంతో అలర్ట్ అయి…పాల పాత్రను కిందకు దించేసి..పొంగిపోకుండా చూసే అవకాశం ఉంది.
Read More : TSRTC : రూ. 100తో 24 గంటలు ప్రయాణించండి
వాడిన పరికరాలు : –
వాటర్ / లిక్విడ్ సెన్సర్లు, బ్యాటరీ, పవర్ సర్య్యూట్లు, బజర్.