Hanuman Birth place: హనుమంతుడి జన్మస్థలం వివాదంలో తెరపైకి మరో కొత్త అంశం

గతంలో బావించినట్టుగా హనుమంతుడు అటు అంజనాద్రిలోనూ, ఇటు కిష్కిందలోనూ జన్మించలేదని..మహారాష్ట్రలోని ఆంజనేరి పర్వతాల్లో జన్మించారని మరో వాదన ప్రస్తుతం తెరపైకి వచ్చింది.

Hanuman Birth place: హనుమంతుడి జన్మస్థలం వివాదంలో తెరపైకి మరో కొత్త అంశం
ad

Hanuman Birth place: హనుమంతుడి జన్మస్థలం విషయంపై మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. తిరుమల తిరుపతిలోని ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలం అంటూ గతంలో టీటీడీ ఆస్థాన పండితులు వాదించగా..కర్నటకలోని కిష్కింద ఆంజనేయుడి జన్మస్థలం అంటూ అక్కడి పండితులు వాదించారు. అయితే ఈ వాదనల పర్వం ఓ కొలిక్కి రాకుండానే హనుమంతుడి జన్మస్థలం విషయంలో మరో కొత్త వాదన తెరపైకి వచ్చింది. గతంలో బావించినట్టుగా హనుమంతుడు అటు అంజనాద్రిలోనూ, ఇటు కిష్కిందలోనూ జన్మించలేదని..మహారాష్ట్రలోని ఆంజనేరి పర్వతాల్లో జన్మించారని మరో వాదన ప్రస్తుతం తెరపైకి వచ్చింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి, శ్రీ మండలాచార్య మహంత్ పీఠాదిపది స్వామి అనికేత్ శాస్త్రి దేశ్‌పాండే మహారాజ్ మే 31న నాసిక్‌లో ధర్మ సంసద్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంసద్ లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు తరలివచ్చి హనుమంతుడి జన్మస్థలంపై తమ అభిప్రాయాలను తెలియజేస్తారని స్వామి అనికేత్ తెలిపారు.

other stories: Cruise Tour: విశాఖలో అందుబాటులోకి లగ్జరీ క్రూయిజ్ షిప్ ప్రయాణం: వైజాగ్ టూ చెన్నై నౌకా విహారం

దీని తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందరూ అంగీకరించాల్సిందేనని కూడా పీఠాధిపతులు స్పష్టం చేశారు. అయితే కిష్కింధకు చెందిన మహంత్ గోవింద్ దాస్ హనుమంతుడి జన్మస్థలం కర్ణాటకలోని కిష్కింద అనే అంశంపై చర్చకు ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. వాల్మీకి రామాయణాన్ని ఉదహరించిన గోవింద్ దాస్ హనుమంతుడు మహారాష్ట్రలోని అంజనేరిలో జన్మించాడన్న వాదనను దాస్ తోసిపుచ్చారు. మహంత్ గోవింద్ దాస్ వాల్మీకి రామాయణంను చేతబట్టి ఆదివారం త్రయంబకేశ్వర్ చేరుకున్నారు. ఆ గ్రంథాల ఆధారంగా నాసిక్‌లోని సాధువులతో హనుమంతుని జన్మస్థలం గురించి చర్చిస్తారు. హనుమంతుడు అంజనేరిలో జన్మించినట్లు వాల్మీకి మహర్షి రామాయణంలో ఎక్కడా రాయలేదన్నారు. పుట్టిన ప్రదేశం ఎప్పుడూ అలాగే ఉంటుందని, హనుమంతుడు నాసిక్‌లోని ఆంజనేరిలో జన్మించాడని ఎక్కడా ప్రస్తావించలేదని మహంత్ గోవింద్ దాస్ వాదించారు.

other stories: Ants find Gold: చీమలు చెప్పిన బంగారు గని రహస్యం: బీహార్‌లో బంగారం ఎలా బయటపడింది

మే 31న జరగనున్న ధర్మ సంసద్‌ను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతలకు భంగం కలుగకుండా నాసిక్ పోలీసులు సంసద్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. నాసిక్-త్రయంబకేశ్వర్ పర్వత శ్రేణుల్లో అంజనేరి ఒకటి. ఇది హనుమంతుని జన్మస్థలమని నమ్ముతారు. హనుమంతుని తల్లి అంజనీ ఈ పర్వతానికి పేరు పెట్టారని, ఈ పర్వతం మీద హనుమంతుడు జన్మించాడని చెబుతారు. అంజనేరి కొండపై హనుమంతుడి ఆలయంతో పాటు అంజనీ మాత ఆలయం ఉంది. హనుమంతుని జన్మస్థలంపై చర్చ కొత్తది కాదు. గతంలో, తిరుమలలోని అంజనాద్రి హనుమంతుని జన్మస్థలమని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పేర్కొంది. ఇది జపాలి తీర్థంలోని కొండకు ఉత్తరాన ఉంది.

other stories: Wheat Exports: గోధుమల దిగుమతి కోసం భారత్‌ను సంప్రదిస్తున్న అనేక దేశాలు

తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ సమక్షంలో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. తిరుమలలోని ఏడుకొండల్లో ఒకటైన అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా పేర్కొంటూ ‘ఎపిగ్రాఫికల్, సైంటిఫిక్, పౌరాణిక ఆధారాలు’తో కూడిన నివేదికను రూపొందించారు. అయితే బళ్లారి సమీపంలోని హంపి శతాబ్దాలుగా ‘కిష్కింధ క్షేత్రం’గా పరిగణించబడుతున్నందున ఆప్రాంతమే ఆంజనేయుడి జన్మస్థలంగా నిర్ధారించాలనేది అక్కడి పండితుల వాదన. ఇక హనుమంతుని జన్మస్థలం అంశంపై టీటీడీ వాదన కర్ణాటకలోని మత, పురావస్తు మరియు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. కాగా కొందరు పురావస్తుశాఖ అధికారులు, చరిత్ర పండితులు టీటీడీ వాదనను తోసిపుచ్చారు.