Sarpatta 2 : సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన ఆర్య.. సార్పట్ట 2 అనౌన్స్..

కరోనా రెండో లాక్ డౌన్ సమయంలో 2021 జూన్ లో ఆర్య నటించిన సార్పట్ట పరంబరై సినిమా డైరెక్ట్ అమెజాన్ ఓటీటీలో రిలీజయింది. అప్పటివరకు ఫ్లాప్స్ లో ఉన్న డైరెక్టర్ పా రంజిత్ కి, ఆర్యకి ఈ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది..................

Sarpatta 2 : సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన ఆర్య.. సార్పట్ట 2 అనౌన్స్..

Director Pa Ranjith and hero Arya combo announce Sarpatta 2 Movie going to shoot soon

Sarpatta 2 :  తమిళ్ హీరో ఆర్య తెలుగు, తమిళ్, మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్నాడు. కరోనా ముందు ఆర్య నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్స్ అవుతూ వచ్చాయి. కరోనా రెండో లాక్ డౌన్ సమయంలో 2021 జూన్ లో ఆర్య నటించిన సార్పట్ట పరంబరై సినిమా డైరెక్ట్ అమెజాన్ ఓటీటీలో రిలీజయింది. అప్పటివరకు ఫ్లాప్స్ లో ఉన్న డైరెక్టర్ పా రంజిత్ కి, ఆర్యకి ఈ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో దుశారా విజయన్ హీరోయిన్ గా నటించింది. పశుపతి ముఖ్య పాత్రలో నటించాడు.

ఆర్య హీరోగా పల్లెటూళ్ళో ఆడే బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. బాక్సింగ్ బాగా ఆడే ఆర్య కొన్ని కారణాల వల్ల బాక్సింగ్ కి దూరమవుతాడు. తర్వాత మళ్ళీ బాక్సింగ్ రింగ్ లోకి వచ్చి తన ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తుంది. కానీ తన శరీరం సహకరించదు. అలాంటి పరిస్థితుల నుంచి తన శరీరాన్ని బాక్సింగ్ కి అనుగుణంగా మార్చుకొని విలన్ల మీద ఎలా గెలిచాడు అనేదే కథ. ఇందులో చూపించిన బాక్సింగ్ సన్నివేశాలు, ఓడిపోయిన ఆర్య ఎమోషన్స్, ఆర్యకి ట్రైనింగ్ ఇచ్చిన క్యారెక్టర్ లో పశుపతి నటన.. ఇవన్నీ బాగా పండటంతో సినిమా సూపర్ హిట్ అయింది.

Samantha : నేను కూడా రీ రిలీజ్ చేస్తానంటున్న సమంత.. ఉమెన్స్ డే స్పెషల్ ఆ సినిమా రీ రిలీజ్..

దీంతో తాజాగా సార్పట్ట సినిమాకి సీక్వెల్ ని ప్రకటించారు చిత్రయూనిట్. పా రంజిత్ దర్శకత్వంలోనే ఆర్య హీరోగా సార్పట్ట రౌండ్ 2 అని సోమవారం నాడు ప్రకటించారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది. దీంతో ఆర్య ఫ్యాన్స్, ఈ సినిమా అభిమానులు ఈ సారి మరింత అదిరిపోవాలి, సినిమా కోసం ఎదురుచూస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారని సమాచారం.

View this post on Instagram

A post shared by Arya (@aryaoffl)