Director Teja : పాప్‌కార్న్ రేట్.. మల్టీప్లెక్స్ చైర్మన్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిన తేజ.. డిబేట్ కూడా సిద్ధం!

మల్టీప్లెక్స్ వ్యవస్థ మరియు పాప్‌కార్న్ రేట్స్ గురించి డైరెక్టర్ తేజ్ మరోసారి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. PVR మల్టీప్లెక్స్ చైర్మన్‌ని డిబేట్ కి రమ్మంటు సవాలు కూడా విసిరాడు.

Director Teja : పాప్‌కార్న్ రేట్.. మల్టీప్లెక్స్ చైర్మన్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిన తేజ.. డిబేట్ కూడా సిద్ధం!

Director Teja viral comments on Indian multiplex chain and popcorn rates

Director Teja : టాలీవుడ్ డైరెక్టర్ తేజ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “థియేటర్ లో సినిమా కల్చర్ చనిపోవడానికి కారణం ఓటీటీ లేదా టీవీ కాదు. థియేటర్ లో అమ్మే పాప్‌కార్న్, కూల్ డ్రింక్ రేట్స్ వల్లే సినిమా చచ్చిపోతుంది. బాలీవుడ్ దారుణంగా దెబ్బతినడానికి కారణం కూడా అదే” అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఈ వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీలోని పలువురు స్టార్ హీరోలు, దర్శకులు కూడా ట్వీట్ చేశారు. తాజాగా తేజ మరోసారి ఆ విషయం కామెంట్స్ చేశాడు. ఆ విషయంలో డిబేట్ కి దిగడానికి కూడా సిద్ధం అంటూ సవాలు విసిరాడు.

Ashish Vidyarthi : ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి పై మొదటి భార్య కామెంట్స్..

కాగా మొన్న పాప్‌కార్న్ గురించి తేజ చేసిన వ్యాఖ్యలు పై రియాక్ట్ అవుతూ ప్రముఖ మల్టీప్లెక్స్ PVR చైర్మన్‌ అజయ్ బిజిలి.. “సింగల్ స్క్రీన్ ఆపరేషనల్ ఖర్చుతో పోలిస్తే మల్టీప్లెక్స్ ఆపరేషనల్ ఖర్చు డబల్ ఉంటుంది. ఇక కొన్ని రాష్ట్రాల్లో సినిమా టికెట్ ఇంతే ఉండాలని రూల్ ఉంటుంది. నష్టం వచ్చినా ఆ రూల్స్ కి తగ్గట్టు టికెట్ ని అమ్మాల్సి వస్తుంది. అయితే అక్కడ కలిగిన నష్టాన్ని పూర్చుకోవడానికి పాప్‌కార్న్ అండ్ కూల్ డ్రింక్ రేట్స్ దగ్గర కవర్ చేస్తుంటాం” అని వివరణ ఇచ్చాడు.

ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో తేజకి తెలియజేయగా, ఆయన బదులిస్తూ.. “సినిమాని రేంజ్ ని బట్టి టికెట్ రేటు ఆధారపడి ఉంటుంది. అంతేగాని థియేటర్ లో జరుగుతున్న ఆపరేషనల్ ఖర్చు బట్టి కాదు. ఒక కర్చీఫ్ బయట రూ.10కి వస్తుంది. అదే కర్చీఫ్ ని ఏసీ రూమ్ లో పెట్టి రూ.50 లకి అమ్ముతూ.. ఆ ఏసీ ఖర్చుని కూడా అందులో కలుపుకోవాలి కదా? అంటే అది ఎక్కడి న్యాయం. అంతేకాదు ఒక ప్రేక్షకుడు అనేవాడు ఇంటిలో టీవీ ఉన్నా, ఓటీటీ ఉన్నా.. ఒక పెద్ద స్క్రీన్ పై సినిమా చూసి ఆ అనుభవాన్ని ఫీల్ అవ్వడానికి థియేటర్ కి రావాలని అనుకుంటాడు. కానీ మల్టీప్లెక్స్ అని చెప్పి 150 మంది సీటింగ్ ఒక హోమ్ థియేటర్ వంటి స్క్రీన్ లో సినిమా వేసి చూపిస్తున్నారు. అలాంటప్పుడు ఇంటిలో కూర్చొని ప్లాస్మా టీవీలోనే సినిమా చూద్దాం అనుకుంటారుగా ఆడియన్స్” అని గట్టి కౌంటర్ ఇచ్చాడు.

K Vasu : ఇండస్ట్రీలో మరో విషాదం.. చిరంజీవి ఫస్ట్ మూవీ దర్శకుడు మృతి..

అలాగే PVR చైర్మన్‌ అజయ్ బిజిలి చేసిన మరో వ్యాఖ్యలు కూడా తేజకి తెలియజేశారు. ఆ కామెంట్స్ ఏంటంటే.. “మల్టీప్లెక్స్ కల్చర్ ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. మారుతున్న కల్చరల్ పడుతున్న ఇబ్బందులు ఇవి. ఒకసారి ఆ కల్చర్ అలవాటు పడ్డాక అంతా మామూలుగానే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక దీనికి తేజ కౌంటర్ ఇస్తూ.. “ముంబై, ఢిల్లీ వంటి డెవలప్‌డ్ సిటీస్ ఆ కల్చర్ ని బాగా అర్ధం చేసుకున్నారు కాబట్టే ఈరోజు బాలీవుడ్ సినీ పరిశ్రమ ఆ రేంజ్ లో ఉంది” అంటూ వెటకారంగా బదులిచ్చాడు. అలాగే ఈ విషయంలో డిబేట్ కి దిగే ఆలోచన ఉంది అంటే తను సిద్ధమని మల్టీప్లెక్స్ వ్యవస్థకి సవాలు విసిరాడు.