Hyderabad Traffic : 8 గంటల్లో లక్షా 77 వేల చలాన్లు క్లియర్..

వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న రాయితీలకు భారీ స్పందన వస్తోంది. ప్రభుత్వం కల్పించిన ఆఫర్ తో ఇలాంటి సమయంలోనే...

Hyderabad Traffic : 8 గంటల్లో లక్షా 77 వేల చలాన్లు క్లియర్..

Traffic Challans

Traffic E  Challans : వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న రాయితీలకు భారీ స్పందన వస్తోంది. ప్రభుత్వం కల్పించిన ఆఫర్ తో ఇలాంటి సమయంలోనే తమ చలాన్లను క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారు. చలాన్లు కట్టేందుకు వాహనదారులు భారీగా రావడంతో.. సర్వర్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో సర్వర్ లో సాంకేతిక సమస్యలుతలెత్తి, సేవలు నిలిచిపోయాయి.

Read More : నిమిషానికి 700పెండింగ్ చలాన్లు క్లియర్

ఆఫర్ ప్రారంభమైన సమయం నుంచి వెబ్ సైట్ ద్వారా రుసుములు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. చలాన్ల చెల్లింపు అమల్లోకి వచ్చిన తొలి 8 గంటల్లోనే లక్షా 77వేల చలానాలను వాహనదారులు క్లియర్​చేశారు. వీటి ద్వారా కోటి 77లక్షల రూపాయలు వచ్చాయి. సాయంత్రానికి 5 లక్షల చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు తెలిపారు. చలాన్ల విలువ 20 కోట్లు అంటే రాయితీ పోనూ.. 5 కోట్ల రూపాయలు వసూలయ్యాయని వెల్లడించారు.

Read More : New Traffic Fines : GHMC వాహనాలపై భారీగా చలాన్లు

ఈ నెల 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వెబ్​సైట్​లోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు. వాహనదారులు తమ చలానాలను ట్రాఫిక్‌ ఈ-చలానా వెబ్‌సైట్‌, ట్రాఫిక్ పోలీస్‌ వెబ్‌సైట్‌, నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెల్లించవచ్చు. సాంకేతిక సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు సర్వర్ల సామర్థ్యం పెంచారు. యూపీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు చేశారు.