Fever : పిల్లలకు జ్వరమే కదా అని లైట్ తీసుకోకండి.. ఎందుకంటే?

ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఫిట్స్‌ రెండవసారి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం వచ్చినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Fever : పిల్లలకు జ్వరమే కదా అని లైట్ తీసుకోకండి.. ఎందుకంటే?

Feveer (1)

Updated On : March 5, 2022 / 1:31 PM IST

Fever : చిన్న పిల్లల్లో జ్వరం సాధారణంగా కనిపించేదే అయినా నిర్లక్ష్యం చేస్తే ఫిట్స్‌కు దారితీయవచ్చు. 6 నెలల నుంచి 5 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లల్లో ఫిట్స్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైరల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఫీవర్‌ ఏదైనా జ్వరం 102 డిగ్రీలు దాటితే ఫిట్స్‌ వచ్చే అవకాశం పెరుగుతుంది. తల్లి దండ్రుల్లో ఎవరికైనా గతంలో ఫిట్స్‌ వచ్చి ఉంటే ఈ రిస్క్‌ మరింత ఎక్కువగా ఉంటుందని సూచిస్తున్నారు వైద్యులు. ఫిట్స్‌ లో సింపుల్‌, కాంప్లెక్స్‌ అని రెండు రకాలుంటాయి. 15 నిమిషాల కన్నా తక్కువ సమయం ఉండే ఫిట్స్‌ని సింపుల్‌ ఫిట్స్‌ అంటారు. 15 నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఉన్నట్లయితే కాంప్లెక్స్‌ ఫిట్స్‌ అంటారు. ఫిట్స్‌ వచ్చినపుడు మెదడులో నరాలు స్టిమ్యులేట్‌ అవుతుంటాయి.

పుట్టగానే శిశువుల్లో ఫిట్స్‌ వచ్చే అవకాశం ఉంటుంది. శిశువు పుట్టగానే ఎడవకపోయినట్లయితే. ఫిట్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఒక్కోసారి ఎలక్ట్రోలైట్స్‌ అంటే సోడియం, పొటాషియం లవణాలు తగ్గిపోవడం కూడా కారణమవుతుంది. కాల్లియం లోపం, గ్లూకోజ్‌ లోపం వల్ల కూడా ఫిట్స్‌ వచ్చే అవకాశం ఉంది. శిశువుల్లో ఫిట్స్‌ వచ్చినపుడు ప్రత్యేకంగా లక్షణాలు కనిపించవు. కాళ్లు, చేతులు అదేపనిగా కదపడం వంటి లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చు.

మొదటి నెల నుంచి రెండు, మూడు ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల్లో వచ్చే ఫిట్స్‌కి జ్వరం కారణమవుతుంది. రెండవది మెనింజైటిస్‌ అంటే మెదడు వాపు. ఇన్‌ఫెక్షన్‌ మెదడు పొరల్లోకి చేరడం వల్ల ఫిట్స్‌ వస్తుంటాయి. మెదడులో ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ అయ్యే వరకు ఫిట్స్‌ నియంత్రణలోకి రావు. క్‌ నుంచి ఆ పైన వయస్సున్న పిల్లలకు ఏ కారణం లేకుండా ఫిట్స్‌ రావచ్చు. అలాంటి వారిలో మెదడులో టీబీ గడ్డ లేదా న్యూరో సిస్తెసెర్కోసిస్‌ కారణం కావచ్చు. శుభ్రమైన ఆహారం తీసుకోకపోవడం, కూరగాయలు శుభ్రంగా కడిగి ఉపయోగించకపోవడం వల్ల న్యూరో సిస్టిసెర్కోసిస్‌ సమస్య మొదలవుతుంది. ఇది ఫిట్స్‌కు దారితీస్తుంది. పంది మాసం తినేవారిలోనూ ఇది కనిపిస్తుంది.

గుర్తించటం ఎలాగంటే…

పెద్దవారిలో మాదిరిగా పిల్లల్లో ఫిట్స్‌ వచ్చినపుడు జర్క్‌ కనిపించకపోవచ్చు. ఫిట్స్ వచ్చిన సందర్భంలో కళ్లు ఒకసైడుకు మరల్చి చూస్తుండటం, నోటి నుంచి నురగ, మల, మూత్ర విసర్జన జరగడం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు. ఫిట్స్‌ వచ్చిన సమయంలో ఫీవర్‌ ఎక్కువగా ఉంటుంది. రెండేళ్లు దాటిన పిల్లల్లో ఫిట్స్‌ లక్షణాలు క్లియర్‌గా కనిపిస్తాయి. ఫిట్స్‌ రాగానే చేతిలో తాళం గుత్తి పెట్టడం లేదా ఏదైనా ఇనుప వస్తువు పెట్టడం చేస్తుంటారు. కానీ ఈ పనుల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఫిట్స్‌ వచ్చినపుడు పిల్లాడిని ఒకవైపు పడుకోబెట్టాలి. ఎందుకంటే ‘ వాంతులు అవుతున్నప్పుడు ఆ పదార్ధాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవైపు పడుకోబెట్టడం మూలంగా ఆ ప్రమాదం ఉండదు. అలా పడుకోబెట్టి. ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఫిట్స్‌ 80 నిమిషాలు దాటకుండా చూసుకోవాలి. ఎక్కువ సమయం వస్తే మెదడు దెబ్బతినే అవకాశం ఉంటుంది.

ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఫిట్స్‌ రెండవసారి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు జ్వరం వచ్చినపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీవర్‌ వచ్చినపుడు మొదటిరోజే డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి. జ్వరం ఎక్కువగా ఉంటే తడి గుద్దతో తుడుస్తూ ఉందాలి. ప్రతీ ఆరుగంటల కొకసారి జ్వరం మందులు వేయడం చేయాలి. పాత ప్రిస్కిప్షన్‌ ఆధారంగా మందులు వాడటం మంచిది కాదు. ఎందుకంటే రకరకాల ఇన్‌ఫెక్షన్ల మూలంగా జ్వరం రావచ్చు. మూత్రంలో ఇన్‌ఫెక్షన్‌, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌, పేగుల్లో ఇన్‌ఫెక్షన్‌ వంటి కారణాల వల్ల జ్వరం రావచ్చు. దేనివల్ల జ్వరం వచ్చిందో. తెలుసుకోవడం కోసం వైద్యులు అవసరమైన పరీక్షలు చేస్తారు.