Lose Weight : బరువు తగ్గటానికి డెడ్ లైన్ వద్దు!

బరువు తగ్గాలన్న లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజు వారిగా తీసుకునే ఆహారాన్ని కొద్దికొద్ది మొత్తాల్లో తీసుకోవాలి.

Lose Weight : బరువు తగ్గటానికి డెడ్ లైన్ వద్దు!

Lose Weight (1)

Lose Weight : సన్నగా, నాజుగ్గా మారాలని, భారంగా ఉన్న శరీర బరువును తగ్గించుకోవాలని చాలా మంది కోరుకుంటుంటారు. సన్న బడటం అనేది ఒక్కరోజులో అయ్యేపనికాదు. నిధానంగా జరిగే ప్రక్రియ. బరువు తగ్గటానికి చాలా మంది ఒక డెడ్ లైన్ పెట్టుకుంటుంటారు. అయితే ఇది ఏమాత్రం సరైంది కాదంటున్నారు నిపుణులు. డెడ్ లైన్ పెట్టుకోవటం వల్ల బరువు తగ్గక పోగా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తద్వారా శారీరకం పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

బరువు తగ్గాలనుకున్నప్పుడు పోషకాహార నిపుణులను, డైటీషియన్లను సంప్రదించటం మంచిది. వారి ద్వారా కొన్ని సూచనలు సలహాలు తీసుకోవచ్చు. ఇవి బరువు సులభంగా తగ్గటంలో ఎంతో దోహదపడతాయి. బరువు తగ్గటం కోసం చాలా మంది ఒంటరిగా వ్యాయామాలు, నడక వంటివి చేస్తుంటారు. అలా కాకుండా స్నేహితులతో కలసి వ్యాయామాలు, నడక , జాగింగ్ వంటివి చేస్తే రోజు వారి వ్యాయామాలపై ఆసక్తి పెరగటంతోపాటు ఎక్కువ సమయం చేసేందుకు అవకాశం ఉంటుంది.

బరువు తగ్గాలన్న లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూనే బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. రోజు వారిగా తీసుకునే ఆహారాన్ని కొద్దికొద్ది మొత్తాల్లో తీసుకోవాలి. ఒకే సారి అధిక మొత్తంలో తీసుకోవటం వల్ల బరువు తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్ తినటం తగ్గించాలి. దానికి బదులుగా పోషకాహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకుంటూ రోజుకు పది నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. వారంలో రెండ్రోజులు అరగంట వ్యాయామానికి కేటాయించాలి.

బరువు తగ్గాలనుకునే వారు శరీరానికి ద్రవాపదార్ధాలు ఎక్కువ మోతాదులో అందించాలి. చక్కెర, అనవసర కేలరీలున్న పానీయాల జోలికి వెళ్ళొద్దు వీటి వల్ల బరువు పెరగకపోను పెరిగే ప్రమాదం ఉంటుంది. మంచినీళ్లను తాగటం మంచిది. నీళ్లు తాగటం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీని వల్ల తక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకుంటారు. తద్వారా బరువు సులభంగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.