K Viswanath Passed Away : కె.విశ్వనాథ్ షూటింగ్ సెట్‌లో ఖాకీ డ్రెస్‌లో ఉండడానికి గల కారణం తెలుసా?

కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణవార్త సినీ పరిశ్రమని కలిచి వేస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వంటి ఈతరం హీరోలను కూడా డైరెక్ట్ చేసిన విశ్వనాథ్.. కెరీర్ బిగినింగ్ సమయంలో షూటింగ్ సెట్ లో ఖాకీ డ్రెస్ లోనే కనిపించేవారు. అందుకు గల కారణం..

K Viswanath Passed Away : కె.విశ్వనాథ్ షూటింగ్ సెట్‌లో ఖాకీ డ్రెస్‌లో ఉండడానికి గల కారణం తెలుసా?

K Viswanath Passed Away

K Viswanath Passed Away : తెలుగు తెర పై ఎన్నో ఆణిముత్యాలు చిత్రీకరించిన స్వాతిముత్యం దివికేగిసింది. కళనే కథగా చూపించే కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంత కాలంగా వయోభారంతో బాధ పడుతున్న ఆయన గురువారం (ఫిబ్రవరి 2) రాత్రి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు అంతా కళాతపస్వి మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు.

K Viswanath : కళాతపస్వి వచ్చి అభిమానితో మాట్లాడితే.. వైరల్ అవుతున్న ఓ అభిమాని ఆవేదన..

సౌండ్ ఇంజనీర్ గా కెరీర్ మొదలు పెట్టిన విశ్వనాథ్ ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా మారారు. భారతీయ కళలకి, సాహిత్యానికి, సంగీతానికి పెద్దపీట వేస్తూ ఆయన చిత్రాలు ఉండేవి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి అల్లరి నరేష్ వంటి ఈతరం హీరోలను కూడా డైరెక్ట్ చేసిన విశ్వనాథ్.. కెరీర్ బిగినింగ్ సమయంలో షూటింగ్ సెట్ లో ఖాకీ డ్రెస్ లోనే కనిపించేవారు. విశ్వనాథ్ అలా ఖాకీ డ్రెస్ వేసుకొని షూటింగ్ కి రావడానికి ఒక సామజిక స్పృహతో కూడిన ఆలోచన ఉంది. సినిమా కోసం పని చేసే ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండే విశ్వనాథ్.. సెట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ సమానమే అని భావించేవారు. ఆ క్రమంలోనే ఆ స‌మాన‌త్వానికి గుర్తుగా ఖాకీ డ్రెస్‌ ధరించేవాడిని అంటూ ఒక ఇంటర్వ్యూలో విశ్వనాథ్ తెలియజేశారు.

K Viswanath – Chiranjeevi : మెగాస్టార్‌తో కళాతపస్వి బంధం.. ప్రతి సినిమాకి అవార్డు!

మెగాస్టార్ చిరంజీవి కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పారు. తాను ఎంతోమంది దర్శకులతో పని చేసినట్లు, కానీ కె.విశ్వనాథ్ గారిలా సెట్ లోని ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడే వ్యక్తిని చూడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే చిరంజీవికి విశ్వనాథ్ అంటే ఎంతో గౌరవం, ప్రేమ. ఆయనని తండ్రిలా భావిస్తాడు. విశ్వనాథ్ కూడా చిరంజీవిని అలానే చూసేవారు, చిరు ఎప్పుడు కనిపించినా కొడుకులా ముద్దాడేవారు. ఆయన మరణ వార్త తెలిసి చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా ప్రస్తుతం విశ్వనాథ్ భౌతికకాయాన్ని ఆయన ఇంటి వద్దనే ఉంచారు. ఆయనని కడసారి చూసేందుకు అభిమానులు, ప్రముఖులు ఇంటి వద్దకి చేరుకుంటున్నారు. ఆయన గౌరవార్థం నేడు తెలుగు చిత్రసీమ బంద్ ప్రకటించింది.