Snake : పాము కాటుకుగురైన వెంటనే ఏంచేయాలో తెలుసా?..

విషపూరితమైన పాము కాటు వేస్తే ముందుగా నోటివెంట నురగ రావడం గమనించవచ్చు. ఊపిరి అందకపోవడం, వికారము ,వాంతులు అయ్యే అవకాశం ఉండొచ్చు,కనుబొమ్మలు పైకి ఎత్త లేకపోవడం శరీరంలో ఉన్న కండరాలు అన్నీ చచ్చు పడిపోవడం, కళ్ళు బైర్లు కమ్ముకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Snake : పాము కాటుకుగురైన వెంటనే ఏంచేయాలో తెలుసా?..

Snake

Snake : ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలుపైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పాముకాటు వేసిన వెంటనే భయం కారణంగా చాలా మంది మరణిస్తున్నారు. అయితే పాము కరిచిన వెంటనే ధైర్యంగా వ్యవహరిస్తే ప్రాణాపాయం నుండి సులభంగా భయటపడవచ్చు. ఎంతటి విషపు పాము కరిచినా…తక్షణం కొద్దిపాటి ముందస్తు చికిత్స అందిస్తేసరిపోతుంది.

పొలాలలో పని చేసే వాళ్ళకి పాము కాటు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కరిచే పాములలో నూటికి 90 శాతం విషం లేని పాములు ఉంటాయి. వాటి వలన ఆ విషం ఎక్కడం గానీ, ప్రాణాపాయం గాని జరగదు.. పాము కరిచిందనే భయం వలన వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. విషం ఉండే పాములు కరిస్తే అరగంట లేదా గంట సమయంలోపే ప్రాణాపాయం సంభవిస్తుంది. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములుఉండగా వాటిలో 52 విష సర్పాలు. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగిఉన్నాయి. అవి కరిస్తే 3 గంటల్లో మనిషి చనిపోతాడు.. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.

పాము కరిచిన వెంటనే ఆపాము విషపూరితమైనదా…లేదా అని నిర్ధారించుకోవాలి. కరిచిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి. పామును అప్పటికే చంపేసి ఉంటే, దాని నోరు తెరిచి చూసే ప్రయత్నం చేయాలి.. దానికి రెండు కోరలు ఉంటే అదే విషం ఉన్న పాము అర్థం చేసుకోవచ్చు.. విషపు పాము కరిస్తే….కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది.ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆలోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు తక్కువ.

విషపూరితమైన పాము కాటు వేస్తే ముందుగా నోటివెంట నురగ రావడం గమనించవచ్చు. ఊపిరి అందకపోవడం, వికారము ,వాంతులు అయ్యే అవకాశం ఉండొచ్చు,కనుబొమ్మలు పైకి ఎత్త లేకపోవడం శరీరంలో ఉన్న కండరాలు అన్నీ చచ్చు పడిపోవడం, కళ్ళు బైర్లు కమ్ముకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విషపు పాము కరిచిన వెంటనే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని బయటకు లాగాలి. మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి సృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కొరల్లో  0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే విషం ఉంటుంది.

ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి . దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే…పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. అనంతరం చికిత్స నిమిత్తం వైద్యుని వద్దకు తీసుకువెళ్ళాలి.