Eat Almonds : బాదం తింటూ చెడు కొవ్వులు కరిగించండి..

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించాలనుకునే వారు కనీసం ఆరువారాల పాటు బాదం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాదం చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది.

Eat Almonds : బాదం తింటూ చెడు కొవ్వులు కరిగించండి..

Badam

Eat Almonds : అత్యధికంగా పోషకాలు లభించే పప్పుల్లో బాదం పప్పు ఒకటి. బాదం పప్పును నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బాదంలో పీచు, మెగ్నీషియం, ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పోషకాహారం. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు పొట్ట నిండిన భావన కలిగిస్తాయి. దీని వల్ల ఎక్కవ ఆహారం తీసుకోలేము. తద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు.

ఉదయం సమయంలో వీటిని తీసుకోవటం వల్ల బాదంలో ఉండే ఎంజైములు జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణ వ్యవస్ధను గాడిలో పెట్టి ఉదర సంబంధిత సమస్యలు తొలగిపోయేలా చేస్తాయి. బాదం పప్పు తినటం వల్ల రక్త ప్రసరణ సాధారణ స్ధితిలో ఉంటుంది. శరీరానికి కావాల్సిన శక్తి, విటమిన్లు, మినరల్స్ దీని ద్వారా లభిస్తాయి.

బాదంలో మెగ్నీషియం సరిపడా ఉంటుంది. అందుకని బాదం గింజల్ని తినడం వల్ల మైగ్రెయిన్‌ తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. లేదా భవిష్యతలో తలనొప్పి రాకుండా నివారించొచ్చు. బాదంగింజల్లో విటమిన్‌ బి2 మెండుగా ఉంటుంది. అందుకనే నాలుగువందల మిల్లిగ్రాముల బాదం తిన్న వాళ్లలో మైగ్రెయిన్‌ తరచుగా రావడం అనేది తగ్గిపోతుంది. మెగ్నీషియం, బి2 విటమిన్లు మైగ్రెయిన్‌ను తగ్గిస్తాయని పరిశోధనల్లో తేలింది.

బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది. బాదంలో ఉన్న ఖనిజ లవణాల వలన ఇది మంచి టానిక్‌గా పనిచేస్తుంది. కొత్త రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. శరీరంలోని మెదడు, గుండె, కా లేయం, నరాలు, కండరాలు, మనసు అన్నీ సక్రమంగా పని చేయడంలో బా దం చాలా సహాయపడుతుంది.

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగించాలనుకునే వారు కనీసం ఆరువారాల పాటు బాదం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బాదం చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రోజు బాదం తినే వారికి చెడు కొలెస్ట్రాల్ 40శాతం తగ్గుతుందని పలు పరిశోధనల్లో తేలింది. రక్తంలో చక్కెర స్ధాయులు క్రమపద్దతిలో ఉండేలా బాదం దోహదపడుతుంది.

గర్భదారణ సమయంలో బరువు పెరగుతారు. కొన్ని సార్లు అది మధుమేహానికి, అధిక రక్తపోటుకు కారణమౌతుంది. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే బాదం తీసుకోవటం పరిష్కారమని పరిశోధకులు చెబుతున్నారు. బరువును అదుపులో ఉంచి తల్లీబిడ్డల ఆరోగ్యానికి బాదం మేలు కలిగిస్తుందని అంటున్నారు.