‘అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో’..

యు వి క్రియేష‌న్స్ అంటే ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటి ఆఫ్ మూవీస్ నిర్మించే నిర్మాణ సంస్థ‌. ‘మిర్చి’ నుండి ఇప్ప‌టి ‘రాధే శ్యామ్’ వ‌ర‌కూ ద‌ర్శ‌కుడి క‌థ‌ని న‌మ్మి మార్కెట్‌కి ఏమాత్రం సంబంధం లేకుండా గ్రాండియర్‌గా సినిమాలు తెర‌కెక్కించారు.

‘అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో’..

Ek Mini Katha: యు వి క్రియేష‌న్స్ అంటే ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటి ఆఫ్ మూవీస్ నిర్మించే నిర్మాణ సంస్థ‌. ‘మిర్చి’ నుండి ఇప్ప‌టి ‘రాధే శ్యామ్’ వ‌ర‌కూ ద‌ర్శ‌కుడి క‌థ‌ని న‌మ్మి మార్కెట్‌కి ఏమాత్రం సంబంధం లేకుండా గ్రాండియర్‌గా సినిమాలు తెర‌కెక్కించారు. యు వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో చిత్రం వ‌స్తుందంటే మంచి చిత్రాలు చూస్తామ‌నే భరోసా ప్రేక్ష‌కుల్లో వుంది. ఇప్ప‌డు వారంద‌రి న‌మ్మ‌కాన్ని మ‌రింత బ‌ల‌ప‌రుస్తూ యు వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కి అనుభంద సంస్థగా యు వి కాన్సెప్ట్స్ బ్యాన‌ర్‌ని స్థాపించి ప్రేక్ష‌కుడి వినోదాన్ని డబుల్ చేస్తున్నారు.

ఈ బ్యాన‌ర్‌లో మొద‌టి చిత్రంగా ‘ఏక్ మినీ క‌థ’ ని తెర‌కెక్కించారు. ‘మిర్చి’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత సుజిత్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ‘ర‌న్ రాజా ర‌న్’, రాధాకృష్ణని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ‘జిల్’ లాంటి చిత్రాలు నిర్మించి సూప‌ర్ హిట్స్ అందించిన నిర్మాణ సంస్థ యు వి క్రియేష‌న్స్‌లో ఇప్ప‌డు ‘ఏక్ మినీ క‌థ’ చిత్రంతో కార్తీక్ రాపోలు ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నారు. ‘ఏక్ మినీ కథ’ చిత్ర ఫస్ట్ లుక్ చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. Does Size Matter అంటూ పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్ప‌డు ‘ఏక్ మినీ క‌థ’ టీజ‌ర్ కూడా కామ‌న్ ఆడియ‌న్స్ అండ్ సోష‌ల్ మీడియా పీపుల్‌ని బాగా ఆక‌ట్టుకుంది.

Ek Mini Katha

టీజ‌ర్‌లో టైమింగ్‌తో ఆక‌ట్టుకున్న‌సంతోష్ శోభ‌న్‌
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు (వర్షం, బాబి) శోభ‌న్ గారి కుమారుడిగా ‘పేప‌ర్ బాయ్’ చిత్రంతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యమై ప్రేక్ష‌కుల చేత న‌టుడిగా మంచి మార్కులు వేయించుకున్నాడు. ఇప్ప‌డు ‘ఏక్ మినీ క‌థ’ చిత్రంలో చాలా ఢిఫ‌రెంట్ క‌థతో ప్రేక్ష‌కులను న‌వ్విండానికి సిధ్ధ‌మ‌య్యాడనే విష‌యం టీజ‌ర్ చూస్తే అర్థమవుతోంది. ‘అది చిన్న‌దైతే మాత్రం ప్రాబ్లం పెద్ద‌దే బ్రో’ అనే డైలాగ్‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టు‌కున్నారు.

మేర్ల‌పాక గాంధి-యువి కాంబినేష‌న్‌
‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రంతో యు వి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో స‌క్స‌స్ సాధించిన ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధి ఈ చిత్రానికి క‌థ‌ అందించారు. ‘వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘కృష్ణార్జున యుద్ధం’ లాంటి చిత్రాల‌తో టాలీవుడ్‌లో దూసుకుపోతున్న మేర్ల‌పాక గాంధి ఇప్పుడు ఈ ‘ఏక్ మినీ క‌థ’కి క‌థ‌, ర‌చ‌న ఇవ్వ‌ట‌మే కాకుండా ద‌ర్శ‌కుడు కార్తీక్ రాపోలుకి త‌న స‌పోర్ట్‌ని అందించడం విశేషం.

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య తాప‌ర్‌, శ్రద్ధాదాస్‌, బ్ర‌హ్మ‌జి, స‌ప్త‌గిరి, సుద‌ర్శ‌న్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, జ‌బ‌ర్ధ‌స్ట్ అప్పారావు, రూప లక్ష్మి, జెమిని సురేష్‌, ప్ర‌భు త‌దిత‌రులు
టెక్నికల్ టీమ్..
కథ, మాట‌లు: మేర్లపాక గాంధీ
దర్శకుడు: కార్తీక్ రాపోలు
నిర్మాణ సంస్థ: యూవీ కాన్సెప్ట్స్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
స్క్రీన్‌ప్లే .. మేర్ల‌పాక గాంధి, షేక్ దావూద్‌.
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌.. తోట విజ‌య భాస్క‌ర్‌
లిరిక్స్‌.. భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీజో.
డాన్స్‌.. య‌స్ మాస్ట‌ర్‌
ఫైట్స్‌.. స్టంట్ జాషువా
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి
ఎడిటర్: సత్య. జి
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.. ఎన్ . సందీప్‌
లైన్ ప్రోడ్యూస‌ర్‌.. ఎస్‌.పి. నాగర్జున వ‌ర్మ (ప్ర‌వీణ్‌)
కొ-డైర‌క్ట‌ర్‌.. బైరెడ్డి నాగిరెడ్డి
ప‌బ్ల‌సిటి డిజైన‌ర్‌.. క‌బిల‌న్ చెల్లై
క్రియేటివ్ టీం.. అనిల్ కుమార్ ఉపాద్యాయిల.