Etala Rajender : కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని పోలింగ్‌ బూత్‌ నంబర్ 262లో ఓటు వేశారు.

Etala Rajender : కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల

Etala (1)

Updated On : October 30, 2021 / 12:47 PM IST

Huzurabad By Election 2021 : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలాపూర్‌లోని పోలింగ్‌ బూత్‌ నంబర్ 262లో ఓటు వేశారు. నియోజకవర్గంలో పలు కేంద్రాలకు వెళ్లి పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్నారు. 90 శాతం ఓటింగ్‌ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హుజూరాబాద్ ప్రజలు ఆత్మను ఆవిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఆవేశం, ప్రేమను ఓట్ల రూపంలో చూపిస్తున్నారని తెలిపారు. 90 శాతం పైగా ఓటింగ్‌ జరిగేలా ఉందన్నారు. నియోజకవర్గ ఓటర్లు తనపై ప్రేమను ఓట్ల రూపంలో చూపిస్తున్నారన్న ఈటల..న్యాయం, ధర్మం ఈటల ధర్మం గెలుస్తుందన్నారు.

Huzurabad : భారీ పోలింగ్‌ దిశగా హుజూరాబాద్‌లో ఓటింగ్

అంతకుముందు ఈటల రాజేందర్‌.. కందుగులలోని పోలింగ్‌ బూత్‌ను విజిట్‌ చేశారు. పోలింగ్‌ను పరిశీలించారు. నియోజకవర్గ ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు ఈటల రాజేందర్‌.

హుజూరాబాద్‌లో ఓటింగ్ భారీగా సాగుతోంది. సాయంత్రంలోపు 90 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం నమోదయింది. ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ…ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.