Ukraine: డాన్‌బాస్‌లో ర‌ష్యా బ‌ల‌గాల‌ను అడ్డుకుంటున్నాం: ఉక్రెయిన్‌

రష్యా దాడులను తిప్పికొట్టి డాన్‌బాస్ ప్రాంతాన్ని కాపాడుకోవ‌డానికి అన్ని విధాలుగానూ ప్ర‌యత్నాలు కొన‌సాగిస్తున్నామ‌ని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్ప‌టికే డాన్‌బాస్‌లోని ప‌లు ప్రాంతాల్లో ర‌ష్యా దాడులు కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే.

Ukraine: డాన్‌బాస్‌లో ర‌ష్యా బ‌ల‌గాల‌ను అడ్డుకుంటున్నాం: ఉక్రెయిన్‌

JelenZelensky scy

Ukraine: రష్యా దాడులను తిప్పికొట్టి డాన్‌బాస్ ప్రాంతాన్ని కాపాడుకోవ‌డానికి అన్ని విధాలుగానూ ప్ర‌యత్నాలు కొన‌సాగిస్తున్నామ‌ని ఉక్రెయిన్ తెలిపింది. ఇప్ప‌టికే డాన్‌బాస్‌లోని ప‌లు ప్రాంతాల్లో ర‌ష్యా దాడులు కొన‌సాగిస్తోన్న విష‌యం తెలిసిందే. తూర్పు డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో భీక‌రదాడులు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ… డాన్‌బాస్‌పై దాడులు కొన‌సాగించి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి ర‌ష్యా వీలైన‌న్ని ఆయుధాలు, వీలైనంతమంది సైనికుల‌ను వాడుకుంటోంద‌ని చెప్పారు.

Gujarat : 8 ఏళ్ల పాలనలో గాంధీజీ, పటేల్ కలల సాకారానికి కృషి చేశాం : ప్రధాని మోడీ

క్షిప‌ణులు, యుద్ధ విమానాల‌తో పాటు అన్ని ర‌కాల ఆయుధాల‌తో డాన్‌బాస్‌లో రష్యా దాడులు కొన‌సాగిస్తోంద‌ని తెలిపారు. త‌మ భూభాగాన్ని కాపాడుకునేందుకు తామూ త‌మ సైనిక‌ శ‌క్తిని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్నామ‌ని చెప్పారు. మ‌రోవైపు, డాన్‌బాస్‌ను చేజిక్కించుకోవ‌డం కోసం చేస్తోన్న దాడుల్లో భాగంగా ఇప్ప‌టికే తాము సీవీరోడోనెట్స్క్‌ను చుట్టుముట్టామంటూ ర‌ష్యా చేసిన ప్ర‌క‌ట‌నలో వాస్త‌వం లేద‌ని లుహాన్స్క్ గ‌వ‌ర్న‌ర్ సెర్గి గైడే చెప్పారు. అలాగే, లుహాన్స్క్ ప్రాంతాన్నీ ర‌ష్యా స్వాధీనం చేసుకునే అవ‌కాశం లేద‌ని చెప్పారు. అక్క‌డ ర‌ష్యా బ‌ల‌గాల‌ను అడ్డుకునే శ‌క్తి ఉక్రెయిన్‌కు ఉంద‌ని తెలిపారు. కాగా, సీవీరోడోనెట్స్క్‌తో పాటు లుగాన్స్క్ ప్రావిన్స్‌లోని లిసిచాన్స్క్ ప్రాంతానికి చేరువ‌కు ర‌ష్యా సైనికులు ఇప్ప‌టికే ప్ర‌వేశించారు.