బెంగాల్ లో వివక్ష, జాత్యహంకార వేధింపులు, ఉద్యోగాలు వదిలి మణిపూర్ చేరుకున్న 185మంది నర్సులు

వెస్ట్ బెంగాల్ లోని పలు ఆసుపత్రుల్లో పని చేస్తున్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన 185మంది నర్సులు తమ

  • Published By: naveen ,Published On : May 22, 2020 / 07:46 AM IST
బెంగాల్ లో వివక్ష, జాత్యహంకార వేధింపులు, ఉద్యోగాలు వదిలి మణిపూర్ చేరుకున్న 185మంది నర్సులు

వెస్ట్ బెంగాల్ లోని పలు ఆసుపత్రుల్లో పని చేస్తున్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన 185మంది నర్సులు తమ

వెస్ట్ బెంగాల్ లోని పలు ఆసుపత్రుల్లో పని చేస్తున్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన 185మంది నర్సులు తమ ఉద్యోగాలు వదిలేసిన సంగతి తెలిసిందే. బెంగాల్ లో వివక్ష, జాత్యహంకారం తట్టుకోలేక వారు ఉద్యోగాలు వదిలేశారు. వారం రోజుల క్రితం వారు స్వరాష్ట్రానికి పయనం అయ్యారు. ఎట్టకేలకు శుక్రవారం(మే 22,2020) వారంతా మణిపూర్ చేరుకున్నారు. అక్కడి నుంచి తమ ఇళ్లకు వెళ్లారు.

మణిపూర్ కు చెందిన నర్సులకు వేధింపులు:
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రతాపం చూపిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే వెస్ట్ బెంగాల్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అక్కడ జాత్యహంకార వేధింపులు ఎక్కువయ్యాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారి పట్ల వివక్ష చూపిస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక 185మంది నర్సులు ఉద్యోగాలు వదిలేసి సొంత రాష్ట్రం మణిపూర్ వెళ్లిపోయారు. దీనిపై ఓ నర్సు స్పందించింది.

నర్సులపై ఉమ్మి వేస్తున్న బెంగాల్ వాసులు:
ఈ విప్కతర పరిస్థితుల్లో నర్సు ఉద్యోగాన్ని వదిలేసి రావడం తనుకు ఇష్టం లేకపోయినా మరోదారి లేక ఈ పని చేశానని వాపోయింది. బెంగాల్ లో స్థానికుల నుంచి తాము తీవ్రమైన జాత్యహంకార, వివక్ష ఎదుర్కొన్నామని వాపోయింది. కొందరు స్థానికులు తమపై ఉమ్మి కూడా వేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పైగా తమకు సరైన వసతి సౌకర్యాలు కానీ వైద్య పరికరాలు కానీ అందుబాటులో లేవని చెప్పింది. తమకు కరోనా రాకుండా ఉపయోగించే పీపీఈ కిట్ల కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. వైద్య సేవలు అందించేందుకు ఎక్కడికి వెళ్లినా స్థానికులు తమనుశ్నించే వారని, చాలా నీచంగా చూసేవారని కన్నీటి పర్యంతం అయ్యింది.

వసతి అధ్వానం, వైద్య పరికరాల కొరత:
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో, రాజధాని కోల్ కతాలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. ఈ పరిస్థితుల్లో వైద్య సేవలు చాలా ముఖ్యం. అయితే ఆసుపత్రుల్లో పని చేసే నర్సులు వివక్ష ఎదుర్కొంటున్నారు. ఈ కారణంతో సుమారు 300మంది నర్సులు ఉద్యోగాలు వదిలేసి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వారిలో 185మంది మణిపూర్ వాసులే ఉన్నారు. బెంగాల్ లో సరైన సౌకర్యాలు లేవని నర్సులు వాపోయారు. ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న తాము వివక్షకు గురయ్యామన్నారు.

ఇల్లు ఖాళీ చేయాలని నర్సులకు వేధింపులు:
బెంగాల్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. సరైన వైద్య పరికరాలు లేవన్నారు. వైద్య సిబ్బంది ఉండేందుకు కనీస వసతులు కూడా లేవన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదని చెప్పారు. హాస్టల్స్ లో ఒక్కో రూమ్ లో 8 నుంచి 10 మంది షేర్ చేసుకునే దుస్థితి ఉందన్నారు. ఈ కారణంగా ఇన్ ఫెక్షన్ల రేటు పెరిగే ప్రమాదం ఉందన్నారు. పైగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్న తమకు ఇంటి యజమానుల నుంచి చీత్కారాలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని యజమానులు వేధిస్తున్నారని కంట తడి పెట్టారు.

Read: 83రోజుల తర్వాత ఢిల్లీ దాటిన మోడీ…కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో మమత స్వాగతం