Fake Astronaut Love cheating : అంతరిక్షంలో ఉన్నా.. భూమ్మీదకు రాగానే పెళ్లి చేసుకుంటానంటూ మహిళకు టోకరా..రూ.24 దోచేసిన ఫేక్ వ్యోమగామి

అంతరిక్షంలో ఉన్నాను..భూమి మీదకు తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటాను అంటూ ఓ ఫేక్ వ్యోమోగామి ఓ మహిళను నమ్మించాడు. అతని మాటలు నిజమని నమ్మి దాదాపు రూ.25 లక్షలు 'సమర్పించుకుంది.

Fake Astronaut Love cheating : అంతరిక్షంలో ఉన్నా.. భూమ్మీదకు రాగానే పెళ్లి చేసుకుంటానంటూ మహిళకు టోకరా..రూ.24  దోచేసిన ఫేక్ వ్యోమగామి

Fake Astronaut love cheating

Fake Astronaut love cheating : అంతరిక్షంలో ఉన్నాను..భూమి మీదకు తిరిగి రాగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ ఓ ఫేక్ వ్యోమోగామి ఓ మహిళను నమ్మించాడు. అతని మాటలు నిజమని నమ్మింది ఓ మహిళ. ఆమె వయస్సు 65 ఏళ్లు కావటం గమనించాల్సిన విషయం. సదరు వృద్ధురాలిని తానొక వ్యోమోగామిని అని నమ్మించి దాదాపు రూ.25 లక్షలు దోచేశాడో వ్యక్తి. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఈ మోసం జపాన్ లో జరిగింది.

తాను రష్యా వ్యోమగామినని, ప్రస్తుతం అంతరిక్షంలో అంతర్జాతీయ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)లో ఉన్నానంటూ ఓ వ్యక్తి జపాన్ లోని 65 ఏళ్ల మహిళను నమ్మించాడో వ్యక్తి. భూమికి తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆమె నుంచి రూ.24.8 లక్షల వరకు కాజేశాడు.

సదరు మహిళ జపాన్ లోని షిగా రాష్ట్రంలో నివసిస్తోంది. గత జూన్ లో ఆ నకిలీ వ్యోమగామి ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. స్పేస్ సూట్ ధరించి ఉన్న అతడి ఫొటోలు చూసిన ఆ వృద్ధురాలు అతడు నిజంగానే వ్యోమగామి అని నమ్మింది. అక్కడ్నించి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ‘లైన్’ అనే జపాన్ మెసేజింగ్ యాప్ ద్వారా మెసేజ్ లు పంపుకునేవారు. కొన్నిరోజుల తర్వాత ఆ వ్యక్తి సదరు వృద్ధురాలికి లవ్ ప్రపోజల్ చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. జపాన్ లో ఆమెతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాలని ఉందని మన జీవితం హాయిగా సంతోషంగా గడుపుదాం అంటూ ఎన్నో ఊసులు చెప్పాడు. అతని మాటలు ఆమె పూర్తిగా నమ్మేసింది. దీంతో సదరు వ్యక్తి ఆమెను ఉచ్చులోకి లాగాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి

ఐఎస్ఎస్ నుంచి భూమికి తిరిగి రావాలంటే రాకెట్ ఫీజు కోసం డబ్బు కావాలని మహిళకు సందేశం పంపాడు. అది నిజమేనని నమ్మిన ఆ వృద్ధురాలు..ఆగస్టు 19 నుంచి సెప్టెంబరు 5 మధ్యలో పలు విడతలుగా డబ్బు ట్రాన్స్ ఫర్ చేసింది. అడగ్గానే ఆమె డబ్బులు పంపిస్తుండటంతో అతనిలో ఇంకా దురాశ పెరిగింది. ఆమె నమ్మకాన్ని మరింతగా క్యాష్ చేసుకోవాలని ఇంకా డబ్బు కావాలని కోరాడు. ఈక్రమంలో ఎన్నిసార్లు డబ్బు పంపించినా మళ్లీ మళ్లీ డబ్బులు అడుగుతుంటంతో ఆమెకు అనుమానం వచ్చింది. అతని కోసం వివరాలు తెలుసుకోవాటానికి యత్నించినా ఏమాత్రం ఫలితం దొరకలేదు. దీంతో మోసపోయానను గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అతనో ఫేక్ వ్యోమగామి అని తేలింది. అదే విషయాన్ని పోలీసులు ఆమెతో చెప్పేసరికి ఆమె షాక్ అయ్యింది.

మోసపోయేవారు ఉన్నంత కాలం మోసగాళ్ల ఆటలు సాగుతునే ఉంటాయని చెప్పటానికి ఇదొక ఎగ్జాంపుల్. కాగా..పెళ్లిపేరుతో యువతులకు టోకరా వేస్తున్న కేటుగాళ్ల గురించి వింటున్నాం. పెళ్లి చేసుకుంటాననంటూ మోసం చేయటం..అందినకాడికి డబ్బులు దండుకోవటం వంటి మోసాలు జరుగుతునే ఉన్నాయి. పెళ్లి పేరు చెప్పగానే నమ్మేసి డబ్బులతో పాటు తమను తాము అర్పించుకుని ఆతరువాత మోసంపోయామని తెలుసుకుని కుమిలిపోయేవారు కొందరైతే..మరికొందరు ధైర్యం చేసి పోలీస్ ఫిర్యాదు ఇచ్చేవారున్నారు. కానీ సోషల్ మీడియా వేదికగా ఇటువంటి మోసాలు ఎన్నో జరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.