Fireballs Slipping : అకాశం నుంచి జారి పడ్డ ఫైర్ బాల్స్! షాక్ కు గురైన ప్రజలు

Fireballs Slipping : అకాశం నుంచి జారి పడ్డ ఫైర్ బాల్స్! షాక్ కు గురైన ప్రజలు

Fire Balls

Fireballs Slipping : అమెరికాలో అకాశం నుండి పెద్ద సైజులో ఉన్న అగ్నిగోళాలు క్రిందికి జారి పడటం కలకలం రేకెత్తిస్తున్నాయి. అత్యంత వేగంగా అకాశం నుండి ఇవి భూమి వైపు దూసుకువచ్చినట్లు స్ధానికులు గుర్తించారు. నిప్పులు వెదజల్లుతూ మేఘాలలో కదులుతూ ఈ అగ్నిగోళాలు ప్రయాణించటాన్ని టెక్సాస్ వాసులు గమనించి భయాందోళన చెందారు. తమ కెమెరాలలో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే అకాశం నుండి ఇలా అగ్నిగోళాలు జారిపడటం కొత్తేమి కాదు. దీనిని ఉల్కాపాతం అంటారు. కొన్ని సందర్భాల్లో ఉల్కలు నక్షత్రాల్లో చిన్నసైజులో ఉండి అకాశం నుండి జారి పడిపోతుంటాయి. అవి పడిపోయే సందర్భంలో బాగా కాంతి వెదజల్లుతాయి. అయితే అమెరికా అకాశంలో ఆదివారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఫైర్ బాల్స్ కనిపించాయని అమెరికన్ ఉల్కాపాతం సొసైటీ ఏఎమ్ ఎస్ తెలిపింది. టెక్సాస్ తోపాటు, మిస్పౌరీ, అర్కాన్సాస్ తో పాటు మరికొన్ని ప్రాంతాల వాసులు ఈ దృశ్యాలను చూశారు.

మొత్తం 213 ఫైర్ బాల్స్ అకాశం నుండి నేలపైకి దూసుకువచ్చినట్లు ఏఎంఎస్ అంచనావేసింది. 3 నుండి 4సెకన్ల పాటు అకాశంలో ప్రయాణిస్తూ ధ్వనిని విడుదల చేసినట్లు ఇదో రకమైన ఉల్కాపాతంగా ఏఎంఎస్ స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా సైతం అకాశం నుండి క్రింది జారిపడ్డ ఫైర్ ఫైల్స్ ఉల్కాపాతమేనని నిర్ధారించింది.

అకాశంలో ఈ తరహా ఉల్కాపాతం నిత్యం ఏదో ఒకప్రాంతంలో చోటు చేసుకుంటుందని, ఉల్కలు అకాశం నుండి అగ్నిగోళాలుగా క్రిందికి పడిపోతాయని , వీటి వల్ల పెద్దగా నష్టం జరిగిన ఘటనలు ప్రపంచంలో పెద్దగా నమోదు కాలేదని నిపుణులు చెబుతున్నారు. వారంరోజుల క్రితం నార్వేలో సైతం ఇదే తరహా ఉల్కాపాతాన్ని స్ధానికులు గుర్తించారు.