Business women: ఫోర్బ్స్ ఆసియా శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో ముగ్గురు భారతీయులకు చోటు

ప్రముఖ సంస్థ ‘ఫోర్బ్స్’ ప్రకటించిన ఆసియా శక్తివంతమైన మహిళల జాబితా-2022లో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. ఘాజల్ అలాగ్, సోమా మోండల్, నమితా థాపర్ అనే వ్యాపారవేత్తలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

Business women: ఫోర్బ్స్ ఆసియా శక్తివంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో ముగ్గురు భారతీయులకు చోటు

Business women: ఈ ఏడాదికి గాను ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ఆసియా శక్తివంతమైన మహిళల జాబితాలో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. 2022కు గాను ఆసియా నుంచి మొత్తం 20 మంది మహిళల్ని ఎంపిక చేయగా అందులో ముగ్గురు భారతీయ వ్యాపారవేత్తలు చోటు దక్కించుకున్నారు.

Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలన్ మస్క్ వారానికి ఎన్ని గంటలు పని చేస్తున్నాడో తెలుసా?

ఘాజల్ అలాగ్, సోమా మోండల్, నమితా థాపర్ అనే భారతీయ మహిళా వ్యాపారవేత్తలు ఈ జాబితాలో నిలిచారు. కోవిడ్ సందర్భంగా ఎదురైన అవాంతారాలను దాటి మరీ వీళ్లు తమ వ్యాపారాల్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారని ఫోర్బ్స్ సంస్థ పేర్కొంది. ఘాజల్ అలాగ్ ‘హోనాసా కన్స్యూమర్’ సంస్థ కో ఫౌండర్. ‘మామా ఎర్త్’ సంస్థకు ఇది మాతృ సంస్థ. ఘాజల్ 2016లో గుర్గావ్ కేంద్రంగా తన భర్తతో కలిసి ఈ సంస్థను ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో ఈ కంపెనీ యునికార్న్ కంపెనీగా మారింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్ పర్సన్‌గా ఉన్న సోమా మోండల్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న రెండో భారతీయురాలు.

Sania Mirza: సానియా మీర్జా విడాకులకు సిద్ధమైందా.. షోయబ్ ఆమెను మోసం చేశాడా?

సెయిల్.. కేంద్ర సంస్థ అయినప్పటికీ, ఈ సంస్థ విజయం సాధించడంలో సోమా పాత్ర కీలకంగా మారింది. 2021లో ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంస్థ ఆదాయం దాదాపు 50 శాతం పెరిగింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయురాలు నమితా థాపర్. ‘ఎమ్‌క్యూర్ ఫార్మా’ సంస్థలో నమిత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈమె తన సంస్థను విజయపథంలో నడిపించడంలో ముందున్నారు. ఇది ఆమె తండ్రి స్థాపించిన సంస్థ. ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి ఈ సంస్థ ఆదాయం రెట్టింపైంది.