Maoist Attack : మాజీ ఎమ్మెల్యేపై మావోయిస్టుల ఎటాక్.. ఇద్దరు గన్‌మేన్ల గొంతు కోశారు
జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో మంగళవారం మనోహర్‌పూర్‌కు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గురుచరణ్ నాయక్‌ను టార్గెట్‌గా చేసుకొని మావోయిస్టులు దాడి చేశారు.

Maoist Attack
Maoist Attack : జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో మంగళవారం మనోహర్‌పూర్‌కు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత గురుచరణ్ నాయక్‌ను టార్గెట్‌గా చేసుకొని మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడినుంచి గురుచరణ్ నాయక్ తృటిలో తప్పించుకోగా, ఓ గన్ మెన్ ను చంపి మరో గన్ మెన్ ను తమ వెంట తీసుకెళ్లారు. తమ వెంట తీసుకెళ్లిన గన్ మెన్ ని కూడా మావోయిస్టులు హత్యచేసినట్లు చక్రధర్‌పూర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దిలీప్ ఖల్ఖో తెలిపారు.
చదవండి : Maoists warn of sand mafia: ఇసుక మాఫియాకు మావోయిస్టులు లేఖ..కాంట్రాక్టర్లకు శిక్ష తప్పదంటూ హెచ్చరిక
ఘటన గురించిన వివరాలను మీడియాకు వివరించారు దిలీప్ ఖల్ఖో. గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని జీల్రువా గ్రామంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా దానికి ముఖ్యఅతిథిగా గురుచరణ్ నాయక్ హాజరయ్యారు. అతడు వస్తాడన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించారు. ఫుట్ బాల్ మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రేక్షకులలోంచి గురుచరణ్ నాయక్ పై ఫైరింగ్ చేశారు. వెంటనే తేరుకున్న ఆయన గన్ మేన్స్ వెంటనే అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు.
చదవండి : Maoist Dump: ఏపీ – ఒడిశా సరిహద్దుల్లో భారీగా మావోయిస్టు డంపు స్వాధీనం
అనంతరం గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే మావోయిస్టుల కాల్పుల్లో ఘటన స్థలిలోనే ఓ గన్ మెన్ మృతి చెందగా మరో గన్ మెన్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అడివిలో హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. గన్ మేన్స్ దగ్గరనుంచి మూడు ఏకె 47 రైఫిళ్లను లాక్కెళ్లినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మావోయిస్టుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేట కొనసాగిస్తున్నట్లు దిలీప్ ఖల్ఖో వివరించారు.