Alia Bhatt : గంగూబాయిగా అలియా.. ప్రభాస్‌తో పోటీకి సై..

సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా అలియా భట్ ప్రధాన పాత్రలో పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో తెరకెక్కిస్తున్న సినిమా.. ‘గంగూబాయి కతియావాడి’..

Alia Bhatt : గంగూబాయిగా అలియా.. ప్రభాస్‌తో పోటీకి సై..

Alia Bhatt: సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ని తన క్రియేటివిటీతో ఒక శిల్పంలా అత్యద్భుతంగా చెక్కే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా అలియా భట్ ప్రధాన పాత్రలో పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో తెరకెక్కిస్తున్న సినిమా.. ‘గంగూబాయి కతియావాడి’.. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

టీజర్ ఎలా ఉందంటే…
ముంబైలోని కామటిపురా (రెడ్ లైట్ ఏరియా) ప్రాంతంలో, గంగుబాయి అనే వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ లోని ‘మేడమ్ ఆఫ్ కామటిపుర’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
అటువంటి ప్రాంతంలో నివసించే ఓ వేశ్య అందర్నీ శాసించే నాయకురాలిగా ఎలా మారిందనేది సినిమా ప్రధానాంశం. గంగుబాయిగా అలియా నటన అదుర్స్ అని చెప్పాలి.. హావభావాలతో ఆకట్టుకుందామె. విజువల్స్, ఆర్ఆర్ చక్కగా సెట్ అయ్యాయి. టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ప్రభాస్‌తో పోటీ…
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధ కృష్ణ దర్శకత్వంలో యువీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’.. ఈ సినిమాను జూలై 30న రిలీజ్ చెయ్యనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. హిందీలో ప్రభాస్ సినిమా భారీస్థాయిలో రిలీజ్ కానుంది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ సినిమా అంటే బాలీవుడ్‌లో ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘గంగూబాయి కతియావాడి’ చిత్రాన్ని కూడా జూలై 30నే విడుదల చెయ్యనుండడంతో హిందీలో ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ ఎలా ఉండబోతుందోనని ఆసక్తికర చర్చ జరుగుతోంది..