Environment : చెట్లకు దేవుడి ఫోటోలు అంటిస్తున్నాడు…ఎందుకో తెలిస్తే మీరు అదే పనిచేస్తారు…

ఏదో పిచ్చిపట్టి వీరేంద్ర సింగ్ ఇదంతా చేస్తున్నాడని అంతా భావించారు. అయితే కొంత మంది ఎందుకిలా చెట్లకు దేవుడి బొమ్మలు అంటిస్తున్నావంటూ వీరేంద్ర సింగ్ ను ప్రశ్నించారు.

Environment : చెట్లకు దేవుడి ఫోటోలు అంటిస్తున్నాడు…ఎందుకో తెలిస్తే మీరు అదే పనిచేస్తారు…

Environment

Environment : చెట్టు కనిపిస్తే చాలు దేవుడి ఫోటోను అంటిచేస్తాడు..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఇతగాడి వ్యవహారం  అందరిని ఆలోచింప చేస్తుంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలి, చెట్లు నాటాలని చాలా మంది మాటలు చెబుతుంటారు. ఆచరణలో కనీసం జీవితంలో ఒక్క మొక్కని నాటలేరు సరికదా…ఉన్న మొక్కలను సైతం కాపాడలేరు… చత్తీస్ గడ్ కు చెందిన ఓ వ్యక్తి చెట్లను కాపాడుకునేందుకు విన్నూత్న తరహాలో ప్రయత్నిస్తున్నాడు. అతను చేస్తున్న ప్రయత్నం చూసి పర్యావరణ ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన వీరేంద్ర సింగ్ గురించి ప్రస్తుతం చర్చసాగుతుంది. రహదారి వెంట వెళుతున్న క్రమంలో ఎక్కడ చెట్టు కనిపించినా దానికి దేవుడి ఫోటోలను అంటించేస్తాడు. తొలినాళ్ళల్లో ఇతని చేష్టలను జనం వింతగా చూడసాగారు. ఏదో మానసిక సమస్యతో బాధపడుతూ  వీరేంద్ర సింగ్ ఇదంతా చేస్తున్నాడని అంతా భావించారు. అయితే కొంత మంది ఎందుకిలా చెట్లకు దేవుడి బొమ్మలు అంటిస్తున్నావంటూ వీరేంద్ర సింగ్ ను ప్రశ్నించారు. దీంతో అసలు విషయాన్ని వీరేంద్ర సింగ్ వారితో చెప్పారు.

చెట్లు నరికివేత కారణంగా ఇటీవలికాలంలో పర్యావరణం తీవ్రం దెబ్బతింటుందని, మనుషులతోపాటు, ఇతర జీవరాశికి మేలుచేసే చెట్లను కాపాడుకునేందుకే తాను దేవుడి ఫోటోలు అంటిస్తున్నానంటూ సమాధానమిచ్చాడు. దేవుడు ఫోటోలు అంటించిన చెట్లను నరికేందుకు త్వరగా సాహసం చేయరని, అందుకే తాను చెట్లకు దేవుడి ఫోటోలు అంటిస్తున్నానని స్పష్టం చేశాడు. అతను చెప్పిన సమాధానం విన్న వారు ఆశ్ఛర్యపోయారు.  వారుసైతం అదే తరహాలో చెట్లకు దేవుడి ఫోటోలు అంటించటం ప్రారంభించారు.

ప్రస్తుతం చత్తీస్ గడ్ లోని బలోడ్ జిల్లాలో చెట్లకు దేవుడి ఫోటోలు అంటించే ప్రక్రియలో పర్యావరణ ప్రియులు సైతం భాగస్వాములవుతున్నారు. బలోడ్ జిల్లాలోని తరౌడ్ నుండి దైహాన్ వరకు ఎనిమిది కిలోమీటర్ల పొడవున మార్గంలో ఉన్న చెట్ల నరికివేతకు పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్ సిద్ధమౌతుండటంపట్ల వీరేంద్ర సింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు.

కాలుష్యకోరల నుండి భూమండలాన్ని రక్షించుకునేందుకు చెట్లను కాపాడుకోవటం ఒక్కటే మార్గమంటాడు వీరేంద్ర సింగ్, అతని మాటల ద్వారా చాలా మంది చైతన్యవంతమై ఇతనితో కలసి చెట్లకు దేవుడి ఫోటోలు అంటించేకార్యక్రమంలో పాల్గొంటున్నారు.