Gold Loans : కరోనాతో బతుకులు ఆగమాగం..బంగారాన్ని అమ్మేస్తున్నారు

2020 మే నెల‌లో బంగారంపై రుణాలు రూ.46,415 కోట్లు. ఈ ఏడాది మే నెల‌లో రుణాలు రూ.62,101 కోట్ల‌కు పెరిగాయి. గ‌త మార్చిలో బంగారం తాక‌ట్టు పెట్టి 25.9 ల‌క్ష‌ల మంది రుణాలు తీసుకున్నారు. గత మే నెల‌లో బంగారంపై తీసుకున్న అప్పులు 33.8 శాతం పెరిగాయ‌ని రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది.

Gold Loans : కరోనాతో బతుకులు ఆగమాగం..బంగారాన్ని అమ్మేస్తున్నారు

Gold

Gold Loans Coronavirus : కోవిడ్ అందరి బతుకులను ఆగమాగం చేస్తోంది. ఆర్థికంగా బతుకులు చితికిపోయాయి. కొంతమంది ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబాలను పోషించుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. డబ్బులు లేకపోయేసరికి ఒంటిపైనున్న బంగారం..కూడా తాకట్టు పెడుతున్నారు. కొంతమంది బంగారాన్ని అమ్మేస్తున్నారు. గత సంవత్సరం మే నుంచి ఈ ఏడాది మే నాటికి బంగారంపై సామాన్యులు తీసుకున్న రుణాల విలు రూ. 15,686 కోట్లు పెరిగాయి.

2020 మే నెల‌లో బంగారంపై రుణాలు రూ.46,415 కోట్లు. ఈ ఏడాది మే నెల‌లో రుణాలు రూ.62,101 కోట్ల‌కు పెరిగాయి. గ‌త మార్చిలో బంగారం తాక‌ట్టు పెట్టి 25.9 ల‌క్ష‌ల మంది రుణాలు తీసుకున్నారు. గత మే నెల‌లో బంగారంపై తీసుకున్న అప్పులు 33.8 శాతం పెరిగాయ‌ని రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. మే నాటికి గ‌త 12 నెల‌ల్లో ఇత‌ర రంగాల రుణాల కంటే ఎక్కువ‌. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ SBIలో బంగారంపై గత సంవత్సరం సామాన్యులు తీసుకున్న రుణాలు 465 శాతం పెరిగాయని వెల్లడించింది.

ఎస్బీఐలో బంగారంపై రుణాలకు 7.5 శాతం వడ్డీ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. రూ. 20,987 కోట్ల మేరకు బంగారంపై రుణాలిచ్చింది ఈ బ్యాంకు. జైపూర్, ఇండోర్, రత్లాం బులియన్ మార్కెట్ల పరిధిలో ఉన్న రైతుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. పంటల సాగు, ఇతరత్రా అవసరాల కోసం..బంగారం అమ్మడం లేదా..తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు.