AP DSC: డీఎస్సీ 2008 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఊరట.. 2,193 మందికి ఉద్యోగాలు

AP DSC: డీఎస్సీ 2008 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఊరట.. 2,193 మందికి ఉద్యోగాలు

Ap Dsc

AP DSC: ఏపీలో డీఎస్సీ 2008 క్వాలిఫైడ్ అభ్యర్థలకు ఊరట కలిగించింది రాష్ట్ర ప్రభుత్వం. 2008లో డీఎస్సీ క్రెటీరియాలో మార్పుల వలన నష్టపోయిన అభ్యర్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2,193 మంది డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. మినిమం టైం స్కేలుతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పించనుంది.

ఈ విషయంపై విద్యాశాఖామంత్రి ఆదిమూలం సురేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ కాలంగా 2000 మందికిపైగా డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్ పెండింగ్‌లో ఉందని అన్నారు. నియామకాల్లో సమస్య తలెత్తడంతో వారంతా ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఉద్యోగాల కోసం పదేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారని చెప్పారు. సీఎం జగన్ ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు తమ గోడును ఆయనతో చెప్పుకున్నారన్నారు.

వారికి న్యాయం చేయాలని సీఎం ఆదేశించినట్లు సురేష్ తెలిపారు. సీఎం ఆదేశాలతో అభ్యర్థులను గుర్తించామన్నారు. మొత్తం 4600 మంది అభ్యర్థులు ఉన్నారని, వారిలో కొందరు ఆ తర్వాతి నోటిఫికెషన్స్‌లో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ప్రస్తుతం 2193 అభ్యర్థులు ఉండగా.. వీరికి కాంట్రాక్టు పద్ధతిన ఎస్జీటీలుగా నియమించి.. త్వరలో ఉత్తర్వులు జారీచేస్తామని మంత్రి ఆదిమూలం సురేష్ చెప్పారు.