e-Sim in Android: సిమ్ కార్డు లేకుండానే పనిచేసే ఆండ్రాయిడ్ 13 ఓఎస్: డబల్ సిమ్ కూడా ఓకే

ఇప్పటికే మ్యాక్సీ, మినీ, మైక్రో, నానో సిమ్ గా రూపాంతరం చెందిన సిమ్ కార్డు..ఇకపై పూర్తిగా కనుమరుగవనుంది

e-Sim in Android: సిమ్ కార్డు లేకుండానే పనిచేసే ఆండ్రాయిడ్ 13 ఓఎస్: డబల్ సిమ్ కూడా ఓకే

Esim

e-Sim in Android: భౌతిక పరికరాల వాడకాన్ని తగ్గించి వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ పద్ధతులు ఉపయోగించుకునేలా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. సెల్ ఫోన్ సిమ్ కార్డు వంటి సూక్ష్మ అంశాల్లోనూ ఇపుడు ఎలక్ట్రానిక్ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే మ్యాక్సీ, మినీ, మైక్రో, నానో సిమ్ గా రూపాంతరం చెందిన సిమ్ కార్డు..ఇకపై పూర్తిగా కనుమరుగవనుంది. సిమ్ కార్డు స్థానంలో ఎలక్ట్రానిక్ సిమ్ విధానం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం భౌతిక రూపంలో ఉన్న సిమ్ కార్డు స్థానంలో ఈ-సిమ్ పనిచేస్తుంది. అందుకోసం వినియోగదారులు సిమ్ కార్డుకి బదులుగా నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి ప్రత్యేకించి ఒక కోడ్ పొందాల్సి ఉంటుంది. మనం కొనుగోలు చేసిన ఫోన్ మోడల్ వివరాలను నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కి అందించడం ద్వారా..వారు ఒక కోడ్ ని మనకు అందిస్తారు. పూర్తి వివరాలు వెరిఫికేషన్ అయిన తరువాత ఈ-సిమ్ యాక్టివేట్ అవుతుంది.

Also read”Bullet bike blast: అనంతపురం జిల్లాలో పేలిన బుల్లెట్ బైక్

దీంతో వినియోగదారులు సాధారణ సిమ్ లాగానే సేవలు వినియోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొన్ని అధునాతన పరికరాల్లోనే ఈ విధానాన్ని వాడుతుండగా..మరికొన్ని రోజుల్లో సాధారణ ఫోన్లలోనూ ఈ – సిమ్ విధానం అందుబాటులోకి రానుంది. యాపిల్, హువెయి వంటి ఫోన్లలో ఈ – సిమ్ సౌలభ్యం ఉండగా..ఆండ్రాయిడ్ ఓఎస్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించే మనదేశంలో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వినియోగదారుల అభ్యర్ధన మేరకు ఎయిర్ టెల్, జియో, వోడఫోన్ ఐడియా వంటి సంస్థలు ఈ ఈ-సిమ్ సేవలు అందిస్తున్నాయి.

Also read:Vodafone Idea : వోడాఫోన్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. 31 రోజుల వ్యాలిడిటీతో..!

అయితే ఇకపై ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు సైతం ఈ-సిమ్ సేవలు పొందేవిధంగా గూగుల్ చర్యలు తీసుకుంది. ఈమేరకు త్వరలో విడుదల చేయనున్న ఆండ్రాయిడ్ 13 వెర్షన్ లో ఈ ఈ-సిమ్ విధానాన్ని పొందుపరచనుంది గూగుల్ సంస్థ. అదే సమయంలో రెండేసి సిమ్ కార్డులు వాడేవారి కోసం “మల్టీపుల్ ఎనేబుల్ ప్రొఫైల్” అనే ఫీచర్ ను కూడా జోడించింది గూగుల్. దీంతో డ్యూయల్ ఈ – సిమ్ కార్డు కూడా ఒకే ఫోన్లో ఉపయోగించుకోవచ్చు.