Google Pay Limit : గూగుల్ పే నుంచి రోజుకు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చుంటే?

ప్రస్తుతం ఆన్ లైన్ యూజర్లకు Google Pay, PhonePe, Paytm సహా అనేక డిజిటల్ ప్లాట్ ఫాంలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పేకు కూడా రోజు లేదా నెలలో ఎంతవరకు గరిష్టంగా డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చో లిమిట్ ఉంటుంది. 

Google Pay Limit : గూగుల్ పే నుంచి రోజుకు ఎంత డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చుంటే?

Google Pay How Much Money Can You Transfer In A Day

Google Pay Via UPI mode of payment  : ప్రస్తుతం ఆన్ లైన్ యూజర్లకు Google Pay, PhonePe, Paytm సహా అనేక డిజిటల్ ప్లాట్ ఫాంలు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రముఖ ఆన్ లైన్ డిజిటల్ ప్లాట్ ఫాం గూగుల్ పే (Google Pay) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యూపీఐ పేమెంట్స్ (UPI Payments) ఈజీగా చేసేవాటిలో Google Pay ఒకటి.. ఏదిఏమైనా.. ప్రతి డిజిటల్ ప్లాట్ ఫాంలో ఒక్కోదానికి యూపీఐ మోడ్ పేమెంట్ (UPI Mode of Payment) సొంత పరిమితులు ఉంటాయి. అంటే.. రోజుకు ఎంతవరకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు అనే లిమిట్ ఉంటుంది. అలాగే గూగుల్ పేకు కూడా రోజుకు లేదా నెలలో ఎంతవరకు గరిష్టంగా డబ్బు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చో ఒక లిమిట్ ఉంది.

సాధారణంగా అన్ని UPI apps ద్వారా ఒక రోజులో లక్షకు పైగా మనీ ట్రాన్స్ ఫర్ చేయాలన్నా. అలాగే ఒక రోజులో 10 కంటే ఎక్కువ సార్లు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలనుకున్నా.. ఎవరైనా నుంచైనా రూ.2వేల కంటే ఎక్కువ అమౌంట్ రిక్వెస్ట్ కోసం ట్రై చేస్తే.. పేమెంట్ కాదని గుర్తించుకోవాలి. గూగుల్ పే, UPI, యూజర్ల బ్యాంకు, గూగుల్ మధ్య పరిమితులు ఒక్కోలా ఉంటాయి. ఒకవేళ మీ డెయిలీ మనీ ట్రాన్స్ ఫర్ లిమిట్ దాటితే మాత్రం.. మరుసటి రోజు వరకు ఎదురుచూడాల్సిందే.. లేదంటే.. చిన్నమొత్తంలో అమౌంట్ పంపేందుకు రిక్వెస్ట్ పంపుకోవచ్చు. గూగుల్ పే నుంచి అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేసే సమయంలో మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా పేమెంట్ కాదు..

బ్యాంకు లిమిట్స్ :
ఒకవేళ.. మీ డెయిలీ ట్రాన్సాక్షన్స్ UPI లిమిట్ కంటే తక్కువగా ఉన్నా.. మీ అమౌంట్ పేమెంట్ కావడం లేదంటే.. మరో బ్యాంకులో ట్రై చేయొచ్చు. ఎందుకంటే.. ప్రతి బ్యాంకుకు ఒక డెయిలీ ట్రాన్స్ ఫర్ లిమిట్ ఉంటుంది. డబ్బులు బదిలీ చేయాలన్నా.. క్రెడిట్ కావాలన్నా ఆయా బ్యాంకుల రోజువారీ ట్రాన్సాక్షన్ల లిమిట్ పై ఆధారపడి ఉంటుంది.

ఇతర పరిమితులు :
ఎలాంటి మోసపూరిత లావాదేవీలు జరగకుండా ఉండేందుకు వీలుగా ఈ పరిమితులు ఉంటాయి. ఏదైనా అనాధికారిక ట్రాన్సాక్షన్ జరిగినట్టు గుర్తిస్తే.. వెంటనే ఆ ట్రాన్సాక్షన్ పూర్తి కాదు.. రివ్యూ చేయాల్సి ఉంటుంది. మీరు డెయిలీ లిమిట్ దాటకపోయినా.. మీరు ట్రాన్సాక్షన్ చేయలేని పక్షంలో Google Pay సపోర్టు ద్వారా హెల్ప్ తీసుకోవచ్చు. ఒకవేళ.. గూగుల్ పే యూజర్ రూ.1 కంటే తక్కువ అమౌంట్ ట్రాన్స్ ఫర్ లేదా రీసీవ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే పేమెంట్ కాదు.. మీకో ఎర్రర్ మెసేజ్ వస్తుంది.