ఇండియాలో Google Pay నిషేధం.. ఇందులో నిజమెంత? NPCI క్లారిటీ!

  • Published By: veegamteam ,Published On : June 29, 2020 / 02:09 AM IST
ఇండియాలో Google Pay నిషేధం.. ఇందులో నిజమెంత? NPCI క్లారిటీ!

ప్రముఖ డిజిటిల్ యూపీఐ పేమెంట్ ప్లాట్ ఫాం గూగుల్ పే సర్వీసును భారతదేశంలో నిషేధించారా? దేశంలో గూగుల్ పే సర్వీసుపై భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నిషేధం విధించినట్టు వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసింది. భారతదేశంలో NPCI అనేది డిజిటల్ చెల్లింపులను నిర్వహించే ఒక సంస్థ.

 

గూగుల్ పే సహా Phonepe, పేటిఎమ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చెల్లింపుల కోసం ఉపయోగించే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI)ను డెవలప్ చేసింది. అయితే సోషల్ మీడియాలో Google Pay పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ కాదని RBI చెప్పిన వార్తలతో పాటు ‘#GPayBannedByRBI’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన NPCI సంస్థ.. గూగుల్ పే అధికారంగా సురక్షితమని ధృవీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

వాస్తవానికి RBI.. గూగుల్ పే సర్వీసుకు పేమెంట్స్ సిస్టమ్ ఆపరేటర్ (PSO)గా అధికారం ఇచ్చిందని NPCI స్పష్టం చేసింది. గూగుల్ పే వంటి కంపెనీలు PSOకు యాప్ ప్రొవైడర్లు, గూగుల్ పేపై లావాదేవీలు చట్టం ప్రకారం పూర్తిగా భద్రతతో కూడుకున్నవిగా NPCI ధృవీకరించింది.

 

‘UPI, NPCI పేమెంట్స్ సిస్టమ్ ఆపరేటర్ (PSO) గా NPCIకి RBI అధికారం ఇచ్చింది. ఎందుకంటే UPI పాల్గొనే వారందరికీ PSO అధికారం ఇస్తుంది. గూగుల్ పే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ (TPAP) గా వర్గీకరించింది. UPI చెల్లింపు సేవలను కూడా అందిస్తుంది. NPCI ఫ్రేమ్‌వర్క్ కింద UPI బ్యాంకింగ్ భాగస్వాముల ద్వారా పని చేస్తుంది. అధీకృత TPAPలను ఉపయోగించి చేసిన అన్ని లావాదేవీలకు పరిష్కారాలతో కూడిన భద్రత ఉంటుందని స్పష్టం చేసింది.

 

NPCI గురువారమే ఈ క్లారిటీ ఇచ్చినప్పటికీ RBI కు సంబంధించిన న్యూస్ లింక్‌తో పాటు హ్యాష్‌ట్యాగ్ ఒక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్‌లో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. Google Pay సర్వీసుకు RBI అనుమతి లేకుండా ఆర్థిక లావాదేవీలను ప్రారంభించిందని ఆరోపించిన ఆర్థిక ఆర్థికవేత్త అభిజిత్ మిశ్రా పిల్‌కు ఢిల్లీ హైకోర్టులో RBI ఒక ప్రకటన చేసింది.

 

గూగుల్ పే ఎటువంటి చెల్లింపు వ్యవస్థలను ఆపరేట్ చేయదని RBI పేర్కొంది. అందుకే దాని పేరు అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని తెలిపింది. దీని కారణంగా చట్టాన్ని ఉల్లంఘించలేదని కూడా కోర్టుకు తెలిపింది. వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ ద్వారా చెల్లింపులు తదితర ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు చట్టపరమైన అన్ని అనుమతులు ఉన్నాయని కూడా ఆర్బీఐ పేర్కొంది. అయినప్పటికీ ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్ తప్పుగా వైరల్ అవుతోంది. NPCI వివరణకు ముందు నుంచే ఈ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

 

యూజర్లకు గూగుల్ పే సర్వీసు ఇప్పటికే పూర్తి యాక్సస్‌లో ఉందని NPCI స్పష్టం చేసింది. అన్ని అధీకృత TPAPలు ఇప్పటికే భారతదేశంలోని అన్ని నిబంధనలు, వర్తించే చట్టాలకు పూర్తి కట్టుబడి ఉన్నాయని తెలిపింది. UPI పేమెంట్స్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమైనదిగా తెలిపింది. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మోద్దని సూచించింది. యుపిఐ కస్టమర్లు తమ OTP, UPI PIN ఎవరితోనూ షేర్ చేయొద్దని NPCI వినియోగదారులకు సూచించింది.

Read: ఫేస్‌బుక్ నుంచి వీడియోలు డౌన్‌లోడ్ ఎలా‌? ఈ ట్రిక్ తెలుసుకోవాల్సిందే!