UltimaSMS : గూగుల్‌ ప్లే స్టోర్‌లో 150 డేంజరస్ యాప్స్ బ్యాన్..!

గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజరస్ యాప్స్ ఉన్నట్టు ఆల్ఫాబెట్ దిగ్గజం గూగుల్ గుర్తించింది. ప్లే స్టోర్ నుంచి 150కు పైగా హానికర యాప్స్ డిలీట్ చేసినట్టు వెల్లడించింది.

UltimaSMS : గూగుల్‌ ప్లే స్టోర్‌లో 150 డేంజరస్ యాప్స్ బ్యాన్..!

Google Removed 150 Malicious Apps From Play Store, Check The List

Google removed 150 malicious apps from Play Store : గూగుల్ ప్లే స్టోర్‌లో డేంజరస్ యాప్స్ ఉన్నట్టు ఆల్ఫాబెట్ దిగ్గజం గూగుల్ గుర్తించింది. ప్లే స్టోర్ నుంచి 150కు పైగా హానికర యాప్స్ డిలీట్ చేసినట్టు వెల్లడించింది. UltimaSMS క్యాంపెయిన్‌ పేరుతో గూగుల్‌ ప్లే స్టోర్‌లో తిష్టవేసిన డేంజరస్ యాప్స్‌ను గుర్తించి బ్యాన్ చేసినట్టు గూగుల్‌ పేర్కొంది. అనంతరం ఆయా యాప్స్ ప్లాట్ ఫాం నుంచి డిలీట్ చేసింది. ఈ డేంజరస్ యాప్స్ వినియోగించేవారిలో ఎక్కువగా నటీనటులు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ డేంజరస్ యాప్స్‌ను ప్లే స్టోర్‌​ నుంచి సుమారు 10.5 మిలియన్ కంటే ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారని గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రీమియం SMS సర్వీసుల కోసం సైన్ ఇన్ అయిన బాధితుల నుంచి సమాచారాన్ని తస్కరించే ముప్పు ఉందని గూగుల్ హెచ్చరించింది. మనీ రిటర్న్ చేస్తామంటూ నమ్మించే సర్వీసులను నమ్మి వారి స్కామ్ లో ఇరుక్కోవద్దని సూచించింది. ఈ మొత్తం Ultima Keyboard 3D Pro అనే క్యాంపియన్ వెనుక ఒక గ్రూపు ప్రమేయం ఉందని యాంటీవైరస్ సంస్థ Avast ఒక ప్రకటనలో పేర్కొంది.
Aashritha Daggubati : నీకు అడ్డుచెప్పేవాళ్లు ఎవరూ లేరు.. సమంత పోస్టుపై వెంకటేష్ కూతురు కామెంట్స్

UltimaSMS ఏంటి? :
సైబర్‌నేరగాళ్లు.. అనేక హానికరమైన యాప్స్‌ను డెవలప్ చేసి గూగుల్‌ ప్లే స్టోర్‌లో పెడుతున్నారు. ఈ యాప్స్‌ సాయంతో తక్కువ ధరలోనే పలు ప్రీమియం SMS సర్వీసులను అందిస్తామని యాప్స్‌ క్యాంపెయిన్ చేస్తున్నాయి. ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, ఒమన్, ఖతార్, కువైట్, యునైటెడ్ స్టేట్స్, పోలాండ్‌లోని ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువగా ఇలాంటి యాప్స్ బారిన పడుతున్నారని తెలుస్తోంది. ప్రీమియం సర్వీసులను అందించడమే కాకుండా యూజర్లు డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉందంటూ ఆఫర్లను గుప్పిస్తున్నాయి. UltimaSMS యాప్స్‌తో యూజర్ల డేటాను హ్యకర్లు తస్కరించే రిస్క్ ఉంది. ప్లే స్టోర్‌ నుంచి యూజర్లు యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయగానే.. లోకేషన్‌ను, ఫోన్‌ IMEI నంబర్, ఫోన్ నంబర్‌ ను డేంజరస్ యాప్స్ ట్రాక్ చేస్తాయి. యూజర్ల మెయిల్ అడ్రస్‌ కూడా హ్యకర్లకు చిక్కే ప్రమాదం లేకపోలేదని అవాస్థ్‌ తెలిపింది.

ఈ ఫేక్ యాప్స్.. ఎక్కువగా కస్టమ్ కీబోర్డులు, QR కోడ్ స్కానర్లు, వీడియో, ఫొటో ఎడిటర్స్, స్పామ్ కాల్ బ్లాకర్లు, కెమెరా ఫిల్టర్లు, గేమ్స్ సహా ఇతర చాలా యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తున్నాయి. ఇలాంటి ఫేక్ యాప్స్ ఇప్పటివరకూ 80 దేశాల్లోని యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. మిడిల్ ఈస్ట్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, పాకిస్తాన్ యూజర్లు ఎక్కువగా ఈ ఫేక్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారని తేలింది. ఆ తర్వాత అమెరికా, పోలాండ్ యూజర్లు ఎక్కువగా ఈ డేంజరస్ యాప్స్ డౌన్ లోడ్ చేసుకున్నారు. గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) నుంచి డౌన్ లోడ్ చేసే యాప్స్ విషయంలో ముందుగా క్రెడిన్షియల్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంతేకాదు.. యాప్ రివ్యూలతో పాటు రేటింగ్స్ కూడా చెక్ చేసుకోవాలి. మీకు నమ్మకం కుదిరినప్పుడు మాత్రమే ఆయా యాప్స్ మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవడం చేయాలి.
Covid Variant AY.4.2 : 5 రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు..థర్డ్ వేవ్ సంకేతమా!