Google Search: గూగుల్ సెర్చ్‌లో గ్రామర్ చెక్ ఫీచర్ వచ్చేసింది.. ప్రస్తుతం ఆ ఒక్క భాషలో మాత్రమే అందుబాటులోకి..

టెక్ దిగ్గజం గూగుల్ తన గూగుల్ సెర్చ్‌లో వినియోగదారులకోసం కొత్త గ్రామర్ చెక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.

Google Search: గూగుల్ సెర్చ్‌లో గ్రామర్ చెక్ ఫీచర్ వచ్చేసింది.. ప్రస్తుతం ఆ ఒక్క భాషలో మాత్రమే అందుబాటులోకి..

Grammar Check Feature

Grammar Check Feature: టెక్ దిగ్గజం గూగుల్ తన గూగుల్ సెర్చ్‌లో వినియోగదారులకోసం కొత్తగా గ్రామర్ చెక్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది కేవలం ఇంగ్లీష్ భాషకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో మరిన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఏఐ టెక్నాల‌జీతో తీసుకొచ్చిన ఈ గ్రామర్ చెక్ ఫీచర్ ద్వారా ఒక వాక్యం.. వ్యాక‌ర‌ణ రీత్యా స‌రిగా ఉందాలేదా అని స‌రిచూసుకోవ‌చ్చు.

Google Android Users : ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ వార్నింగ్.. ఆగస్టులోగా మీ ఫోన్లను అప్‌డేట్ చేసుకోండి..!

గూగుల్ కొత్త‌గా తీసుకొచ్చిన గ్రామ‌ర్ చెక్ ఫీచ‌ర్ ను ఉప‌యోగించ‌డం చాలా తేలిక‌. గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి ఇంగ్లీష్‌లో ఒక వాక్యాన్ని న‌మోదు చేయాలి. త‌రువాత గ్రామర్ చెక్, చెక్ గ్రామర్ లేదా గ్రామర్ చెక్క‌ర్ అని టైప్ చేయాల్సి ఉంటుంది. అది వెంట‌నే మీరు న‌మోదు చేసిన ప‌దం వ్యాక‌ర‌ణం రిత్యా స‌రిగ్గా ఉదా? లేదా? అనే విష‌యాన్ని తెలియ‌జేస్తుంది. మీరు నమోదు చేసిన వ్యాక్యం వ్యాకరణపరంగా సరిగ్గా ఉంటే మొదటి ఫలితంగా గ్రామ‌ర్ చెక్‌ విభాగంలో ఆకుపచ్చ చెక్‌మార్క్ క‌నిపిస్తుంది. త‌ప్పుగా ఉంటే రెడ్ మార్క్ క‌నిపిస్తుంది. అయితే, లోపాలు ఉంటే గూగుల్ ఆ వాక్యాన్ని సవరించి, దిద్దుబాట్లను హైలైట్ చేస్తుంది. స్పెల్లింగ్ తప్పులను కూడా పరిష్కరిస్తుంది. గూగూల్ గ్రామ‌ర్ చెక్ ఫీచ‌ర్‌ను డెస్క్ టాప్‌లోనూ, మొబైల్ ఫోన్‌లోనూ వినియోగించ‌వ‌చ్చు.