Google Voice : గూగుల్ వాయిస్‌లో కొత్త ఫీచర్.. స్పామ్ కాల్స్ వస్తే వెంటనే యూజర్లను అలర్ట్ చేస్తుంది జాగ్రత్త..!

Google Voice : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వాయిస్‌ (Google Voice) కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చింది. టెక్ దిగ్గజం వార్నింగ్ ఫీచర్‌ను యాడ్ చేసింది.

Google Voice : గూగుల్ వాయిస్‌లో కొత్త ఫీచర్.. స్పామ్ కాల్స్ వస్తే వెంటనే యూజర్లను అలర్ట్ చేస్తుంది జాగ్రత్త..!

Google Voice can now alert users about suspected spam calls

Google Voice : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ వాయిస్‌ (Google Voice) కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తెచ్చింది. టెక్ దిగ్గజం వార్నింగ్ ఫీచర్‌ను యాడ్ చేసింది. ఇన్‌కమింగ్ స్పామ్ కాల్స్ గురించి యూజర్లను అప్రమత్తం చేస్తోంది. గూగుల్ వినియోగదారులు అన్‌వాటెండ్ కాల్స్ నివారిస్తుంది. ఈ కొత్త ఫీచర్ సాయంతో డేంజరస్ స్కామ్‌ల బారిన పడకుండా ప్రొటెక్ట్ చేయవచ్చు.

స్పామ్ కాలర్‌లను గుర్తించడానికి Google ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగిస్తుంది. Google Voice అనేది అమెరికాలోని Google అకౌంట్ కస్టమర్‌లకు కెనడాలోని Google Workspace కస్టమర్‌లకు అందుబాటులో ఉన్న సర్వీసులు, యూజర్ కాల్, టెక్స్ట్ మెసేజ్, వాయిస్ మెయిల్ కోసం ఫోన్ నంబర్‌ను పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు కంప్యూటర్‌లలో కూడా పనిచేస్తుంది. వర్క్‌స్పేస్ బ్లాగ్ అప్‌డేట్‌లో కొత్త ఫీచర్‌ను గూగుల్ ప్రకటించింది. అన్‌వాంటెడ్ కాల్‌లు, హానికరమైన స్కామ్‌ల నుంచి యూజర్లను ప్రొటెక్ట్ చేయడంలో సాయపడుతుంది. Google వాయిస్ స్పామ్ అని విశ్వసించే అన్ని కాల్‌లలో ‘Suspected Spam Caller’ లేబుల్‌ను చూపిస్తుంది.

Google Voice can now alert users about suspected spam calls

Google Voice can now alert users about suspected spam calls

Read Also : WhatsApp Multiple Chats : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు త్వరలో మల్టీపుల్ చాట్లను ఒకేసారి ఎంచుకోవచ్చు..!

Google కాలింగ్ ఎకోసిస్టమ్‌లో ప్రతి నెలా బిలియన్ల కొద్దీ స్పామ్ కాల్‌లను గుర్తించే అడ్వాన్స్‌డ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి Google ఈ నిర్ణయం తీసుకుంటుందని కంపెనీ తెలిపింది.

కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది? :
కొత్త స్పామ్ కాల్స్ లేబుల్ ఇన్‌కమింగ్ కాల్ స్క్రీన్‌తో పాటు కాల్ హిస్టరీలో కనిపిస్తుందని గూగుల్ తెలిపింది. యూజర్ల కోసం రెండు ఆప్షన్లు ఉంటాయి. అందులో యూజర్లు అనుమానిత స్పామ్ కాల్‌ని నిర్ధారించగలరు. దీని వలన భవిష్యత్తులో ఆ నంబర్ నుంచి వచ్చే కాల్‌లు నేరుగా వాయిస్‌మెయిల్‌కి వెళ్లి కాల్ హిస్టరీ ఎంట్రీలను స్పామ్ ఫోల్డర్‌లో ఉంచుకోవచ్చు. రెండవ ఆప్షన్ ఏమిటంటే.. లేబుల్ చేసినకాల్‌ని స్పామ్ కాదని గుర్తించాలి. ఆ తర్వాత అనుమానిత స్పామ్ లేబుల్ నంబర్‌కు మళ్లీ కనిపించదు.

గూగుల్ ప్రకారం.. ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే డిసెంబర్ 29 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ Google Voice కస్టమర్‌లందరికీ అందుబాటులో ఉంది. అలాగే, వాయిస్ స్పామ్ ఫిల్టర్ ఆఫ్‌లో ఉంటే అనుమానిత స్పామ్ లేబులింగ్ స్క్రీన్‌పై ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది.

అనుమానిత స్పామ్ కాల్‌ని ఆటోమాటిక్‌గా వాయిస్‌మెయిల్‌కి పంపడానికి, Settings> Security> Filiter Spam > దాన్ని ఆన్ చేయడం ద్వారా నావిగేట్ చేయండి. స్పామ్ ఫిల్టరింగ్ ఆన్‌లో ఉన్నప్పుడు Google స్పామ్‌గా గుర్తించే అన్ని కాల్‌లు ఆటోమాటిక్‌గా వాయిస్‌మెయిల్‌కి పంపవచ్చు. కాల్ ఎంట్రీ స్పామ్ ఫోల్డర్‌లోనే ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : New Year 2023 : వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 2023 న్యూ ఇయర్ స్టిక్కర్‌లను ఎలా పంపాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్!