Telangana formation day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: తమిళిసై
రాష్ట్ర ప్రజలు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు చెప్పారు.

Tamilisai
Telangana formation day: రాష్ట్ర ప్రజలు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ దినోత్సవాన్ని ఆనందంగా, గర్వంగా జరుపుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది యువకులు చేసిన త్యాగాల దృష్ట్యా ఆవిర్భావ దినోత్సవం మరింత ప్రాధాన్యం సంతరించుకుందని ఆమె చెప్పారు.
Mumbai: ముంబైలో మళ్లీ కరోనా విజృంభణ
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నానని గవర్నర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుందని ఆమె చెప్పారు. ఐటీ, ఫార్మా, వ్యవసాయం వంటి రంగాల్లో రాష్ట్రం నాయకత్వం వహిస్తోందని, తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేస్తోందని ఆమె పేర్కొన్నారు.