Electric Highway: ఢిల్లీ నుంచి ముంబైకు ఎలక్ట్రిక్ హైవే నిర్మాణం

ఢిల్లీ నుంచి ముంబై వరకూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రకటించారు. దాంతో పాటు భారీ వాహన యజమానులను ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వాటిని వాడి కాలుష్యాన్ని అడ్డుకోవాలని సూచించారు.

Electric Highway: ఢిల్లీ నుంచి ముంబైకు ఎలక్ట్రిక్ హైవే నిర్మాణం

Electrci Highway

 

 

Electric Highway: ఢిల్లీ నుంచి ముంబై వరకూ ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవే నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ప్రకటించారు. దాంతో పాటు భారీ వాహన యజమానులను ఇథనాల్, మెథనాల్, గ్రీన్ హైడ్రోజన్ లాంటి వాటిని వాడి కాలుష్యాన్ని అడ్డుకోవాలని సూచించారు.

హైడ్రాలిక్ ట్రైలర్ ఓనర్స్ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. రూ.2.5లక్షల కోట్లు వెచ్చించి సొరంగాలను ఏర్పాటు చేస్తున్నట్లు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిష్టర్ తెలిపారు.

“ఢిల్లీ నుండి ముంబైకి ఎలక్ట్రిక్ హైవేని తయారు చేయాలనేది మా ప్రణాళిక. ట్రాలీబస్ లాగానే, ట్రాలీట్రక్కులను కూడా నడపవచ్చు” అని వివరించారు.

ట్రాలీబస్ అనేది ఎలక్ట్రిక్ బస్సు, ఇది ఓవర్ హెడ్ వైర్ల శక్తితో నడుస్తుంది. ఎలక్ట్రిక్ హైవే అనేది సాధారణంగా ఓవర్ హెడ్ పవర్ లైన్లతో సహా దానిపై ప్రయాణించే వాహనాలకు విద్యుత్ సరఫరా చేస్తుంది. అన్ని జిల్లాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానం చేయాలని తమ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుందని గడ్కరీ తెలిపారు.

Read Also : గడ్కరీ వ్యాఖ్యలపై కమలనాథులు గుస్సా

రాష్ట్ర ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో (ఆర్‌టీఓ) అవినీతి కారణంగా భారీ వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అంగీకరించారు.

“కాబట్టి, RTOలు అందించే అన్ని సేవలను డిజిటలైజ్ చేయాలి. ఇథనాల్, మిథనాల్, గ్రీన్ హైడ్రోజన్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉపయోగించాలని భారీ వాహన యజమానులను అభ్యర్థిస్తున్నా, ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి” అన్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, భారతదేశానికి అన్ని రకాల రవాణా అవసరమని మంత్రి తెలిపారు. చైనా, యూరోపియన్ యూనియన్, యూఎస్‌లతో పోలిస్తే భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువగా ఉందని గడ్కరీ చెప్పారు.