షాకింగ్.. కూతురి ప్రియుడితో తల్లి జంప్

10TV Telugu News

Grandmother of six runs off with daughter’s boyfriend: బ్రిటన్ లో జరిగిన ఓ ఘటన సభ్యసమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. ఏ త్లలి చేయకూడని పని ఆమె చేసింది. మనువళ్లు, మనవరాళ్లను ఎత్తుకుని ఆడుకోవాల్సిన వయసులో తప్పుడు పని చేసింది. ఏకంగా తన కూతురికే షాక్ ఇస్తూ, అతడి ప్రియుడితో ఆమె జంప్ అయ్యింది.

Grandma who ran off with daughter's baby daddy spotted

బ్రిటన్‌లో గ్లౌసెస్టర్ షైర్ లో ఈ ఘటన జరిగింది. ఆమె పేరు జార్జినా ఆల్డ్రిడ్జ్‌. వయసు 44ఏళ్లు. ఆరుగురు మనుమలు, మనుమరాళ్లున్న గ్రాండ్‌మదర్‌. హాయిగా తన పిల్లల పిల్లలతో ఆడుకుంటూ రామా క్రిష్ణా అంటూ కాలం గడపాల్సిన వయసులో ఆమె బుద్ధి తప్పింది. గర్భవతి అయిన 24 ఏళ్ల కూతురు జెస్ ఆల్డ్రిడ్జ్ ప్రియుడు ర్యాన్ షెల్టన్ తో పారిపోయింది.

Grandmother, 44, who ran off with the father of her daughter's children says 'these things happen' | Daily Mail Online

కూతురి ప్రియుడిపై తల్లి కన్ను:
జార్జినా కూతురు జెస్ ప్రెగ్నెంట్. దీంతో ఆమె తన ప్రియుడు ర్యాన్ తో కలిసి తల్లి ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో జార్జినా కన్ను కూతురి లవర్ ర్యాన్‌ పై పడింది. అతడితో చనువు పెరిగింది. ఏం నచ్చిందో కానీ, ర్యాన్ కూడా జార్జినాకు దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్‌ పెరిగింది. దీంతో ఒక రోజు వారిద్దరు కలిసి ఇంటి నుంచి జంప్ అయ్యారు.

Grandmother, 44, who ran off with the father of her daughter's children says 'these things happen' | Daily Mail Online

రెండో బిడ్డకు జన్మనిచ్చిన కుమార్తె జెస్‌.. తన తల్లి తన ప్రియుడితో పారిపోయిందని తెలుసుకుని షాక్ కి గురైంది. దీని గురించి ఆమె తన తల్లిని నిలదీసింది. దానికి ఆమె.. ‘ఎవరు ఎవరి ప్రేమలో పడతారో చెప్పలేం’ అని సింపుల్ గా జవాబిచ్చింది. తల్లి మాటలకు జెస్‌ మరింత ఆశ్చర్యపోయింది.

Grandma who ran off with daughter's baby daddy spotted

రిలేషన్ ను సమర్థించుకున్న తల్లి:
జార్జినా తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వయసులో ఇదేం పాడు పని అంతా తిట్టిపోస్తున్నారు. అయితే జార్జినా, ర్యాన్‌ మాత్రం తమ బంధాన్ని సమర్ధించుకున్నారు. ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతాయని చెప్పారు. కుమార్తె ప్రియుడు ర్యాన్‌ కూడా ఇలాంటి వాదనే వినిపించాడు. తమ బంధం గురించి ఎవరు ఎలా అనుకున్నా తాను కేర్ చెయ్యనని చెప్పాడు. తాను జార్జినాని ప్రేమిస్తున్నానని, తనకు ఎలాంటి పట్టింపులు లేవని తేల్చి చెప్పాడు.

తన తల్లి, తన ప్రియుడు కలిసి తనకు చాలా ద్రోహం చేశారని కుమార్తె జెస్‌ వాపోయింది. తన తల్లి చేసిన పనిని తాను ఇంకా నమ్మలేకపోతున్నానంది. తన ఇద్దరు పిల్లల బాగోగులను పట్టించుకోకుండా ఉండేందుకే వారు ఈ పని చేశారని తొలుత భావించానంది. ఆ తర్వాత అసలు నిజం తెలిసి బాధపడ్డానంది. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. కూతురి ప్రియుడితో తల్లి జంప్ అయిందని తెలిసి జనాలు నోరెళ్లబెట్టారు. కలికాలం అంటే ఇదేనేమో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

×