Covid-19 New Rule : వ్యాక్సిన్ వేయించుకోకపోతే..నెలకు రూ.8,500 జరిమానా

వ్యాక్సిన్ వేయించుకోనివారు ప్రభుత్వానికి ప్రతీ నెల రూ.8,500లు జరిమానా కట్టాలని ప్రధాని హుకుం జారీ చేశారు.

Covid-19 New Rule : వ్యాక్సిన్ వేయించుకోకపోతే..నెలకు రూ.8,500 జరిమానా

Greece Govt New Rule 60 Plus Citizens Face Monthly Fine

Covid-19 మహమ్మారి దాదాపు మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తునే ఉంది. కొత్త కొత్త్ వేరియంట్లుగా మారి శాస్త్రవేత్తలకు సవాలు విసురుతునే ఉంది. డెల్టా వేరియంట్ అనీ..ఒమిక్రాన్ అని రెండు కలిపిన వేరియంట్ గా డెలిక్రాన్ వేరియంట్ అంటూ ఇలా కొత్త కొత్త భయాల్ని కలిగిస్తునే ఉంది. కరోనాను కట్టడి చేయటానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తల కృషికి ఫలితంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. వ్యాక్సిన్ వల్ల కోవిడ్ పూర్తిగా అంతరించకపోయినా నియంత్రణ మాత్రం జరిగింది. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా కొనసాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియతో కోవిడ్ అదుపులోకి వచ్చింది. కోవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్స్ లో తన ప్రతాపం చూపినా..వ్యాక్సిన్ వచ్చాక నియంత్రణ జరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కోవిడ్ తో పోరాడుతు వ్యాక్సిన్ తో కట్టడి చేస్తున్నాయి. ఈక్రమంలో థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ గా విరుచుకుపడుతున్నా..పెద్దగా ప్రాణనష్టం మాత్రం జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే వ్యాక్సిన్ కోవిడ్ పై ప్రభావం చూపిస్తోంది.

Also read : No Vaccine No Salary: వ్యాక్సిన్ వేయించుకోకపోతే జీతాలివ్వం: కలెక్టర్ ఉత్తర్వులు

కానీ విచారించాల్సిన విషయం ఏమిటంటే లేని పోని అపోహలతోను..అర్థం పర్థం లేని అనుమానాలతోను వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి సంవత్సరం పూర్తి అయినా ప్రపంచ వ్యాప్తంగా ఈనాటికి చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడటంలేదు. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యాక్సిన్ వేయించుకోవాలని కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అయినా చాలామంది దేన్ని ఖాతరు చేయటంలేదు. దీంతో గ్రీస్ ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకోనివారిపై కఠిన ఆంక్షలు విధిస్తోంది. జరిమానాలు కూడా విధించానికి వెనుకాడటంలేదు.

Also read : Woman Dating Offer : వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్‌కొస్తా..అందాల భామ ఆఫ‌ర్..టీకా వేయించుకోటానికి క్యూ కట్టిన అబ్బాయిలు

దీంట్లో భాగంగానే గ్రీస్ ప్రభుత్వం వ్యాక్సిన్ వేయించుకోనివారు ప్రభుత్వానికి ప్రతీ నెల 100 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.8,500లు జరిమానా కట్టాలని ప్రధాని కిరియాకోస్ మిట్సోటకిస్ హుకుం జారీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలు సోమవారం (జనవరి 17,2022)నుంచి అమలులోకి తెచ్చింది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలనికి కారణం లేకపోలేదు. వైద్య రంగంపై ఒత్తిడి తగ్గించడం కోసమే గ్రీస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read : No Vaccine No Salary : వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు..లేదంటే ఇచ్చేదే లేదు : TSCAB

ఈ కొత్త రూల్ గురించి ప్రధాని కిరియాకోస్ మిట్సోటకిస్ మాట్లాడుతూ..‘‘60 ఏళ్లు దాటిన వారిలో టీకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని..లేదంటే వారిపై కూడా జరిమానా విధించటానికి ఎంతో సమయం పట్టదంటూ స్వీట్ అండ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వ్యాక్సిన్ వేయించుకోండీ..మీ జీవితాలతో పాటు తోటివారి జీవితాలను కాపాడండీ అంటూ సూచించారు. వ్యాక్సిన్ పై అనేక అపోహలు పడుతున్నారు. కానీ అవన్నీ నిజాలు కావు దయచేసిన వ్యాక్సిను సురక్షితమని నమ్మండి..అవగాహన పెంచుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని దేశ ప్రజల్ని ప్రధాని కోరారు. ఈ విషయం ప్రతీ ఒక్కరు అర్థం చేసుకోవాలని..కోవిడ్ కట్టడికి ప్రతీ ఒక్కరు బాధ్యత అనే విషయం మర్చిపోవద్దని సూచించారు.

Also Read : covid-19 వ్యాక్సిన్‌ వేయించుకున్న యువతి..రూ 7.4 కోట్లు గెలుచుకుంది..!!

టీకాలు తీసుకోని వారు వైరస్ బారిన పడితే హాస్పిటల్లో చేరాల్సిన రిస్క్ ఎక్కువగా ఉంటోందని గ్రీస్ అధికారులు చెబుతున్నారు. గ్రీస్ లో కరోనా కారణంగా మరణించిన ప్రతి 10 మందిలో 9 మంది 60 ఏళ్లకు పైబడిన వయసువారే. ఆసుపత్రుల్లో చేరుతున్న ఈ వయసు వారిలో ప్రతి 10 మందికి ఎనిమిది మంది టీకాలు తీసుకోని వారు ఉంటున్నారు. కాబట్టి..ఇకపై టీకాలు తీసుకోని 60 ఏళ్లు దాటిన వారి నుంచి ప్రతీ నెలా 100 యూరోలను పన్ను అధికారులు వసూలు చేయనున్నారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజల్ని కోరుతున్నా పట్టించుకోకపోవటం వల్ల గ్రీస్ ప్రభుత్వం ఈ వార్నింగ్ తో అయినా ప్రజల్ని దారికి తేవాలని భావిస్తోంది.