Woman Dating Offer : వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్‌కొస్తా..అందాల భామ ఆఫర్..టీకా వేయించుకోటానికి క్యూ కట్టిన అబ్బాయిలు
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ కొస్తా. అంటూ ఓ అందాల భామ ఆఫర్ ఇచ్చింది. దీంతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడని అబ్బాయింతా టీకా వేయించుకోవటానికి క్యూ కట్టారు.

Woman Dating Offer
Woman convinces guys to get vaccinated in return for a date కరోనాతో ప్రపంచం అంతా పోరాడుతోంది. కరోనా నుంచి కాపాడుకోవటానికి చాలా మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతునే ఉంది. కానీ ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన వేయించుకోవటానికి ఇష్టపడటంలేదు. ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు ఎంతగా చేస్తున్నా పట్టించుకోవట్లేదు. తాను చెప్పిన పని చేస్తే చిన్నపిల్లలు చాక్లెట్లు, బిస్కెట్లు ఆశపెట్టినట్లుగా ఓ అందాల భామ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీంతో వ్యాక్సిన్ వేయించుకోవటానికి ఇష్టపడని అబ్బాయిలంతా టీకా వేయించుకోవటానికి వెళ్లి వేయించుకుంటున్నారు.
Read more : Crazy Offer: వ్యాక్సిన్ వేయించుకుంటే..గంజాయి మొక్కలు ఫ్రీ..!ఎక్కడో తెలిస్తే షాకే..!!
టిక్ టాక్ లో ఓ యువతి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లతోనే తాను డేటింగ్ చేస్తానంటూ ప్రకటించింది. తన స్నేహితులకు తెలిసినవారికి అందరికి వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతోంది. అంతేకాదు వ్యాక్సిన్ వేసుకుంటే డేటింగ్ చేస్తానంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టిక్‌టాక్‌లో ఆమె చేసిన ఆ ప్రకటన ఆమె రూమ్‌మెట్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా వీడియోను పోస్ట్ చేస్తూ..‘‘తను నా రూమ్‌మెట్. అబ్బాయిలు ఎవరైనా కనిపిస్తే చాలు.. వాళ్లను వ్యాక్సిన్ వేసుకున్నారా అని అడుగుతుంది. వేసుకోలేదు అంటే.. వ్యాక్సిన్ వేసుకుంటే మీతో డేటింగ్ కొస్తా’’ అంటూ బంపర్ ఆఫర్ ఇస్తోందని తెలిపింది. ఆమెతో డేటింగ్ కు వెళ్లాలనే ఆశతో చాలామంది అబ్బాయిలు వారికి ఇష్టం లేకపోయిన వ్యాక్సిన్లు వేయించుకుంటున్నారు.
Read more : covid-19 వ్యాక్సిన్ వేయించుకున్న యువతి..రూ 7.4 కోట్లు గెలుచుకుంది..!!
తరువాత డేటింగ్ కు రమ్మంటే ‘తూచ్ అంతా ఒట్టిదే..’అంటూ కవ్వించే కళ్లతో చక్కటి హావ భావాలతో వారితో పరాచికాలు ఆడోతుంది. వాళ్లు వ్యాక్సిన్ వేసుకున్నాక.. అంతా ఉత్తుత్తే అంటూ వాళ్లను ఆటపట్టించేది.. అంటూ వీడియోను పోస్ట్ చేసింది.ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ యువతి..