Crazy Offer: వ్యాక్సిన్ వేయించుకుంటే..గంజాయి మొక్కలు ఫ్రీ..!ఎక్కడో తెలిస్తే షాకే..!!

రోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి మొదట్లో ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకుంటూ బీరు ఫ్రీ అనీ..మరోచోట టమోటాలు, ఇంకోచోట కోడిగుడ్లు, రెస్టారెంట్ లో బిల్లలులో రాయితీలు అంటూ పలు రకాల ఆఫర్ల గురించి విన్నాం. కానీ అమెరికాలో ఏకంగా వ్యాక్సిన్ వేయించుకుంటే ‘గంజాయి మొక్కలు ఫ్రీ’ అంటూ ప్రకటించారు.

Crazy Offer: వ్యాక్సిన్ వేయించుకుంటే..గంజాయి మొక్కలు ఫ్రీ..!ఎక్కడో తెలిస్తే షాకే..!!

Free Marijuana To Covid Vaccination

free marijuana to covid vaccination : కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటానికి మొదట్లో ఎవ్వరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకుంటూ బీరు ఫ్రీ అనీ..మరోచోట టమోటాలు, ఇంకోచోట కోడిగుడ్లు, రెస్టారెంట్ లో బిల్లలులో రాయితీలు అంటూ పలు రకాల ఆఫర్ల గురించి విన్నాం. కానీ అమెరికాలో మాత్రం ఏకంగా వ్యాక్సిన్ వేయించుకుంటే ‘గంజాయి మొక్కలు ఫ్రీ’ అంటూ ప్రకటించారు. ఇది వింటే వామ్మో గంజాయా? పట్టుకుని లోపలేసేయరూ పోలీసులు అని షాక్ అవుతాం.కానీ అమెరికాలోని వాషింగ్టన్‌లో ‘కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే గంజాయి మొక్కలు ఫ్రీ’ అని ప్రకటించారు. వాషింగ్టన్‌ వాసులు వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుకు రావట్లేదట. దీంతో ఈ విచిత్రమైన ఆఫర్ ప్రకటించారు.

వాషింగ్టన్‌లో ఇప్పటివరకూ 54 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారట. అదికూడా అధికారులు పోరు పెట్టగా పెట్టగా..వ్యాక్సిన్ వచ్చి ఇంత కాలం అవుతున్నా అభివృద్ధి చెందింని చెప్పుకునే యూఎస్ లోనే ఇటువంటి పరిస్థితి ఉండటం గమనించాల్సిన విషయం. ఈ క్రమంలోనే వ్యాక్సినేషన్ రేట్ పెంచడానికి మేలో ‘సిక్స్ వీక్ విండో’లో తమ టీకా వేయించుకున్నవారికి బార్లలో ఆల్కహాల్ డ్రింక్స్ ఇస్తామని ప్రకటించింది.

ఈక్రమంలో తాజాగా యూఎస్ స్టేట్ ఆఫ్ వాషింగ్టన్ ‘జాయింట్స్ ఫర్ జబ్స్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.దీంట్లో భాగంగా 21 ఏళ్లు దాటిన వారు టీకా వేయించుకుంటే..గంజాయి మొక్కలను ఫ్రీగా ఇస్తున్నారు. వాషింగ్టన్ స్టేట్ లిక్కర్ అండ్ గంజాయి బోర్డ్ లైసెన్స్ పొందిన అవుట్‌లెట్స్ లో జూలై 12లోపు వ్యాక్సిన్ తీసుకున్న 21 ఏళ్లు పైబడిన వారికి ప్రీ-రోల్డ్ జాయింట్ అందిస్తారు.కాగా..దేశ స్వాతంత్ర్య దినోత్సవం అయిన జూలై 4 నాటికి కనీసం 70 శాతంమందికి టీకాలు వేయాలని అధ్యక్షుడు జో బిడెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, తాజా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం ప్రస్తుత సంఖ్య 63.7 శాతంగా ఉంది. ఇక కాలిఫోర్నియా, ఒహియో‌లలో వ్యాక్సిన్ వేయించుకున్నవారికి నగదును గిఫ్టుగాను..అలాగే కాలేజీల్లో స్కాలర్‌షిప్‌లు అందించే టీకా ‘లాటరీలను’ నిర్వహిస్తున్నారు.

అమెరికా అంటే భూతల స్వర్గం. ఎంతో అభివృద్ధి చెందిన దేశం. ప్రపంచ వ్యాప్తంగా ఉండే దాదాపు అన్ని దేశాల వారు చదువులు..ఉద్యోగాల కోసం అమెరికాకు వస్తుంటారు.అక్కడే స్థిరపడుతుంటారు. అటువంటి అమెరికా వాసులే వ్యాక్సిన్ వేయించుకోవటానికి ముందుకు రావటంలేదు. దీంతో ఇటువంటి చిత్ర విచిత్రమైన ఆఫర్లు ప్రకటించి ఆకర్షించి మరీ వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాల్సి వస్తోంది అమెరికాలో..!!!