Gulshan Devaiah : తమన్నా ఎవరో కూడా నాకు తెలీదు.. విజయ్ ని ఆటపట్టించడానికే అబద్దం ఆడాను..
ఇటీవల విజయ్ వర్మ స్నేహితుడు, నటుడు గుల్షన్ దేవయ్య నా తమన్నాతో తిరుగుతున్నావు అంటూ విజయ్ వర్మపై కామెంట్స్ చేయడంతో తమన్నా విజయ్ వ్యవహారం మరింత చర్చగా మారింది.

Gulshan Devaiah comments on Vijay varma and Tamannaah Relation
Gulshan Devaiah : స్టార్ హీరోయిన్ తమన్నా(Tamannaah) ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు దాటినా ఇప్పటికి తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమా ఛాన్సులు సంపాదిస్తుంది. 33 ఏళ్ళు వచ్చినా ఈ భామ పెళ్లి గురించి మాత్రం మాట్లాడట్లేదు. కానీ ఇటీవల బాలీవుడ్(Bollywood) నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో రిలేషన్ లో ఉందని, వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. విజయ్ – తమన్నా కలిసి పార్టీలకు వెళ్లడం, కలిసి ఈవెంట్స్ కి వెళ్లడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి.
అయితే ఇటీవల విజయ్ వర్మ స్నేహితుడు, నటుడు గుల్షన్ దేవయ్య నా తమన్నాతో తిరుగుతున్నావు అంటూ విజయ్ వర్మపై కామెంట్స్ చేయడంతో తమన్నా విజయ్ వ్యవహారం మరింత చర్చగా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్, తమన్నా గురించి అడగగా గుల్షన్ సమాధానమిస్తూ.. విజయ్ వర్మ, తమన్నా రిలేషన్ లో ఉన్నారా లేరా అనేది నాకు తెలియదు. వారిద్దరూ కలిసి ఉన్న రెండు, మూడు ఫొటోలు మాత్రం చూశాను. కనీసం తమన్నా ఎవరో కూడా పూర్తిగా నాకు తెలీదు. నేను ఆ రోజు విజయ్ ని ఆటపట్టించడానికే అలా మాట్లాడాను. ఇది తమన్నాకు తెలిస్తే నన్ను కొడుతుందేమో, ఇష్టమొచ్చినట్టు ఎలా మాట్లాడతావు అని తిడుతుందేమో, ఇప్పటికే తమన్నా ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేశారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు తెలీదు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళిష్టం అని అన్నాడు. దీంతో తమన్నా ఫ్యాన్స్ గుల్షన్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా తమన్నా, విజయ్ లు ఈ విషయంపై స్పందించలేదు.